ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో మోడల్‌ను ఒప్పో రిలీజ్ చేసింది. ఒప్పో ఏ53 మోడల్లోని ఫీచర్స్ కాస్త తగ్గించి ఒప్పో ఏ33 2020 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. గత నెలలో ఇదే ఫోన్ ఇండోనేషియా మార్కెట్లో రిలీజైంది. చైనాలో ఐదేళ్ల క్రితం ఒప్పో ఏ33 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒప్పో ఏ33 2020 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది ఒప్పో. ఒప్పో ఏ33 ఫీచర్స్ చూస్తే 6.5 అంగుళాల 90 Hz డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఏఐ ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇతర రీటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు. సేల్ ఎప్పుడు మొదలవుతుందో ఇంకా ప్రకటించలేదు.
The Faster and Smoother #OPPOA33 brings a lot with it. Sporting a 90Hz Punch-hole Display, 18W Fast Charge, 5000mAh Battery and an AI Triple Camera it’s surely going to dazzle you.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.