హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OPPO A17k: బడ్జెట్ ధరకే ఒప్పో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

OPPO A17k: బడ్జెట్ ధరకే ఒప్పో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

OPPO A17k: బడ్జెట్ ధరకే ఒప్పో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే
(image: Oppo India)

OPPO A17k: బడ్జెట్ ధరకే ఒప్పో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే (image: Oppo India)

OPPO A17k | ఒప్పో ఇండియా నుంచి బడ్జెట్ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్ (Budget Smartphone) రిలీజ్ అయింది. రూ.10,000 సెగ్మెంట్‌లో ఒప్పో ఏ17కే మోడల్ రిలీజైంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఒప్పో కంపెనీ ఇండియన్‌ మార్కెట్లో విక్రయాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మిడ్‌ రేంజ్‌లో కొత్త ఫోన్లను లాంచ్‌ చేయడంతోపాటు, వరుసగా కొత్త బడ్జెట్ ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఈ కంపెనీ ఇటీవలే ఇండియన్‌ మార్కెట్‌లోకి A17 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇప్పుడు ఈ సిరీస్‌లోనే ఒప్పో A17k పేరుతో మరో డివైజ్‌ను లాంచ్ చేసింది. ఇందులో తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 5,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో లభిస్తుంది. కొత్తగా లాంచ్‌ అయిన స్మార్ట్‌ఫోన్‌ స్సెసిఫికేషన్లు, ధర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్లు

ఒప్పో A17k స్మార్ట్‌ఫోన్ HD+ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది స్టాండర్డ్ 60Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్‌ చేస్తుంది. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 బేస్డ్ కలర్ ఓఎస్‌తో రన్‌ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో వెనుకవైపు 8MP సింగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్‌ కెమెరాలో 5MP సెన్సార్ ఉంది. IPX4 బేసిక్‌ స్ప్లాష్ రెసిస్టెన్స్‌ రేటింగ్‌తో వస్తుంది. ఈ డివైజ్‌ 5,000mAh బ్యాటరీతో మంచి పవర్ బ్యాకప్‌ను అందిస్తుంది.

YouTube: యూట్యూబ్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక అందరికీ ఆ యాక్సెస్

ధర ఎంత?

ఒప్పో A17k స్మార్ట్‌ఫోన్‌ 4GB+ 64GB వేరియంట్ ధర రూ.10,499గా ఉంది. ఈ వేరియంట్‌ను మాత్రమే కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ ఫోన్‌ గోల్డ్, నేవీ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

తగ్గిన స్పెసిఫికేషన్లు

ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న A17 స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే ఇందులో RAM సైజ్‌ తక్కువగా ఉంది. ప్రైమరీ రియర్‌ కెమెరా రిజల్యూషన్ కూడా తక్కువగా ఉంది, డెప్త్ సెన్సార్ లేదు. ఒప్పో A17k మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది 3GB RAMతో పాటు 4GB వర్చువల్ RAM టెక్నాలజీని అందిస్తోంది. 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని 1TB స్టోరేజ్ వరకు ఎక్స్‌ప్యాండ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్‌మీ C35, రెడ్‌మీ A1+, మోటో E32 వంటి మోడల్స్‌కు పోటీ ఇవ్వనుంది.

JioFiber Diwali Offer: డబుల్ ఫెస్టివల్ బొనాంజా ప్రకటించిన జియోఫైబర్... రూ.6,500 వరకు బెనిఫిట్స్

తగ్గిన ధరలు

ఒప్పో ఇండియాలో కొన్ని ప్రముఖ బడ్జెట్, మిడ్‌ రేంజ్‌ ఫోన్‌ల ధరలను తగ్గించింది. ఈ లిస్ట్‌లో ఒప్పో F21 Pro, ఒప్పో A77, ఒప్పో A55 ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు ప్రస్తుతం కొత్త ధరలతో అందుబాటులో ఉన్నాయి. ఒప్పో F21 ప్రో ధర రూ.1,000 తగ్గింది. దీని 8GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.22,999కాగా, ఇప్పుడు రూ.21,999కి సొంతం చేసుకోవచ్చు. ధరల తగ్గింపు తర్వాత ఒప్పో A77 ఫోన్‌ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.15,999కు లభిస్తోంది. అదే విధంగా ఒప్పో A55 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.14,499కి అందుబాటులో ఉంది.

First published:

Tags: Mobile News, Oppo, Smartphone

ఉత్తమ కథలు