Oppo A16: ఒప్పో నుంచి రూ.10 వేల లోపు బడ్జెట్ లో 4 కెమెరాల ఫోన్...బంపర్ ఆఫర్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పో వరుసగా బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీదుంది. తాజాగా ఒప్పో మరో కొత్త బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఒప్పో ఏ 16 (Oppo A16) పేరుతో దీన్ని ఇండోనేషియా మార్కెట్​లోకి లాంచ్​ చేసింది.

  • Share this:
    ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పో వరుసగా బడ్జెట్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేస్తూ దూకుడు మీదుంది. తాజాగా ఒప్పో మరో కొత్త బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఒప్పో ఏ 16 (Oppo A16) పేరుతో దీన్ని ఇండోనేషియా మార్కెట్​లోకి లాంచ్​ చేసింది. గతేడాది అక్టోబర్​లో విడుదలైన ఒప్పో ఏ 15కు తర్వాతి వెర్షన్​గా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ గల ఒక్క వేరియంట్​లోనే లభిస్తుంది. ఈ మోడల్​ను  భారత కరెన్సీలో సుమారు రూ .10,000 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్ ​క్రిస్టల్​బ్లాక్​, పెరల్​ బ్లూ, స్పేస్​ సిల్వర్​​ అనే మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో విడుదలకు సిద్ధంగా ఉంది.

    ఒప్పో ఏ16 స్పెసిఫికేషన్లు
    ఒప్పో ఏ16 మీడియాటెక్ హెలియో G35 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిన కలర్​ఓఎస్ 11.1 ఆపరేటింగ్​ సిస్టమ్​పై రన్​ అవుతుంది. ఇది 6.52 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. దీని స్క్రీన్​ రిఫ్రెష్​ రేట్​, టచ్​ శాంప్తింగ్​ రేట్​ 60 హెర్ట్జ్​​గా ఉంటుంది. స్క్రీన్​ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంటుంది. దీనిలో 3 జీబీ ర్యామ్​, 32 జీబీ స్టోరేజ్​ను అందించారు. ఈ స్టోరేజ్​ను మైక్రో ఎస్​డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే దీని వెనుకవైపు మూడు కెమెరాలు ఉండగా, వీటిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కెమెరా, 2 మెగా పిక్సెల్​ మాక్రో లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్​ డెప్త్​ సెన్సార్​ కెమెరాలను అందించింది.

    ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం ప్రత్యేకంగా 8 మెగా పిక్సెల్​ కెమెరాను చేర్చింది. ఇది 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ పవర్​ సేవింగ్​ మోడ్​లో పనిచేస్తుంది. ఇక కనెక్టివిటీ ఫీచర్లను పరిశీలిస్తే.. 4జీ ఎల్టీఈ. వైఫై, బ్లూటూత్​, జీపీఎస్​/ఏ–జీపీఎస్​, యూఎస్​బీ టైప్​–సీ, 3.5 ఎంఎం హెడ్​ ఫోన్​ జాక్​ వంటివి అందించింది. వీటితో పాటు ఫింగర్​ ప్రింట్​ రీడర్​ను కూడా చేర్చింది. ఇది ఫేస్ అన్‌లాక్‌కు మద్దతిస్తుంది.
    Published by:Krishna Adithya
    First published: