రూ.10,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ (Smartphone under Rs 10000) కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఒప్పో ఇండియా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఒప్పో ఏ16కే (Oppo A16K) స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది ఒప్పో ఇండియా. గతేడాది ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఒప్పో ఏ16 అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఒప్పో ఏ16కే రిలీజ్ అయింది. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తుంది. ధర రూ.10,490. ఈ బడ్జెట్లో ఇప్పటికే నోకియా సీ20 ప్లస్, మోటో ఈ7, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్02ఎస్, రియల్మీ నార్జో 30ఏ, ఇన్ఫీనిక్స్ హాట్ 11ఎస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. వీటికి ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ పోటీ ఇవ్వనుంది.
ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.52 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంది. డిస్ప్లేలో ఆల్ డే ఐ కేర్ ఫీచర్ ఉంది. సన్‌లైట్ డిస్ప్లే, మూన్లైట్ డిస్ప్లే, ఏఐ స్మార్ట్ బ్యాక్‌లైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో పోకో సీ31, నోకియా జీ20, రెడ్మీ 9, రియల్మీ సీ21 లాంటి మోడల్స్ ఉన్నాయి.
Airtel 2GB Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? ఎయిర్టెల్ లేటెస్ట్ ప్లాన్స్ ఇవే
A splendid 3D Sleek Design and a 4230mAh Long-Lasting Battery that keeps your phone going without needing constant recharging.
Presenting OPPO A16k, uniquely crafted to fit your palms and lifestyle.
Buy now: https://t.co/kESwQZc5q7 pic.twitter.com/rlWOFXvtYj
— OPPO India (@OPPOIndia) January 12, 2022
ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరాలో స్టైలిష్ ఫిల్టర్స్, బ్యాక్లిట్ హెచ్డీఆర్, డాజిల్ కలర్ మోడ్, నైట్ ఫిల్టర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో హెచ్డీఆర్ నేచురల్ స్కిన్ రీటచింగ్, ఏఐ పలేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్‌లో 4,230ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. బ్యాటరీలో సూపర్‌నైట్ టైమ్ స్టాండ్‌బై, ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్, సూపర్‌పవర్ సేవింగ్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, 4జీ ఎల్టీఈ, వైఫై, మైక్రో యూఎస్బీ, బ్లూటూత్ ఫీచర్స్ ఉన్నాయి.
Xiaomi 11i: కాసేపట్లో షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ సేల్... ఎస్బీఐ కార్డుతో రూ.2,500 డిస్కౌంట్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లెక్స్డ్రాప్, థ్రీ ఫింగర్ ట్రాన్స్‌లేట్, ఫ్రీఫామ్ స్క్రీన్‌షాట్ ఫీచర్స్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ బేస్డ్ కలర్ ఓఎస్ 11.1 లైట్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒప్పో ఏ16కే స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ స్టోర్లలో కొనొచ్చు. మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లూ, వైట్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Oppo, Smartphone