ఇప్పటికే అనేక బడ్జెట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో సంస్థ.. జనవరిలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఒప్పో A16K పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది.
ప్రముఖ స్మార్ట్ బ్రాండ్ ఒప్పో(Smart Brand Oppo) వరుసగా బడ్జెట్ స్మార్ట్ఫోన్ల(Budget Smart Phones) ను లాంచ్ చేస్తూ మార్కెట్‌ను విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక బడ్జెట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన ఒప్పో సంస్థ.. జనవరిలో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఒప్పో A16K పేరుతో దీన్ని లాంచ్ చేయనుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్(Launch)గురించి ఒప్పో అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఆన్లైన్లో(Online) లీకైన వివరాల ప్రకారం జనవరి మొదటి లేదా రెండో వారంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఒప్పో A16K ధర (అంచనా)..
భారత మార్కెట్లోకి ఒప్పో A16K స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ తేదీ, ధరపై ఇంకా స్పష్టత లేదు. అయితే, నవంబర్లోనే ఈ స్మార్ట్‌ఫోన్ ఫిలిప్పీన్స్ మార్కెట్లోకి వచ్చింది. అక్కడ ఈ డివైజ్ PHP 6,999 (దాదాపు రూ. 10,350) ధర వద్ద విడుదలైంది. భారత మార్కెట్లోనూ దాదాపు ఇదే ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది.
ఒప్పో A16K స్పెసిఫికేషన్లు (అంచనా)..
ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఒప్పో A16K స్పెసిఫికేషన్లను ఆన్లైన్లో వెల్లడించారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం, ఒప్పో A16K భారతీయ వేరియంట్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హీలియో G35 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. యూఎస్బీ టైప్- సీ పోర్ట్ ద్వారా దీన్ని సులభంగా ఛార్జ్ చేయవచ్చు.
దీనిలోని 4,230mAh బ్యాటరీ 10W ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.52- అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో 8 -మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్ కెమెరా,13 -మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలను అందించింది. అయితే, దీనిలోని సెల్ఫీ కెమెరా స్పెసిఫికేషన్లు టిప్‌స్టార్ వెల్లడించలేదు.
కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లకు మద్దతిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1పై రన్ అవుతుంది. ఫిలిప్పీన్స్‌లో విడుదలైన ఒప్పో A16K మోడల్లో ఇదే ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ వంటివి అందించింది. ఫోన్ ఇండియా మోడల్ మిగిలిన స్పెసిఫికేషన్లు కూడా ఫిలిప్పీన్స్ మోడల్ లాగానే ఉండవచ్చని లీకేజీలను బట్టి తెలుస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.