హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Oppo Phone Offers: రూ.14 వేల ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,000కే పొందండి.. ఎలా అంటే?

Oppo Phone Offers: రూ.14 వేల ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,000కే పొందండి.. ఎలా అంటే?

 Oppo Phone Offers: రూ.14 వేల ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,000కే పొందండి.. ఎలా అంటే?

Oppo Phone Offers: రూ.14 వేల ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,000కే పొందండి.. ఎలా అంటే?

Smartphone Offers | అందుబాటు ధరలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఒప్పొ స్మార్ట్‌‌ఫోన్‌పై భారీ తగ్గింపు పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Phone Offers | మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అది కూడా బడ్జెట్ ఫోన్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఆఫర్ అందుబాటులో ఉంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయ డీల్ లభిస్తోంది. ఒప్పొ కంపెనీకి చెందిన ఏ సిరీస్‌లోని ఒప్పొ (Oppo) ఏ16ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 13,990గా ఉంది. అయితే ఈ ఫోన్‌ను ఇప్పుడు రూ. 8,990కు కొనుగోలు చేయొచ్చు. అంటే ఈ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 900 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే ఈ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే ఈ ఆఫర్‌ను కలుపుకుంటే మీరు ఒప్పొ ఏ16ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 8090కే కొనుగోలు చేయొచ్చు.

భారీ డిస్కౌంట్.. 55 అంగుళాల స్మార్ట్‌టీవీపై రూ.43 వేల తగ్గింపు!

ఈ ఒప్పొ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 6.52 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. వాటర్ నాచ్ డిజైన్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. రిఫ్రెష్ రేటు 60 హెర్ట్జ్. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. ఈ ఫోన్ రెండే వేరియంట్ల రూపంలో లభిస్తోంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ ఒక వేరియంట్. అలాగే 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ మరో వేరియంట్.

మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఈ ఫోన్‌పై రూ.59 వేల డిస్కౌంట్.. ఉచితంగానే రూ.30 వేల స్మార్ట్‌వాచ్!

ఈ రెండు వేరియంట్లలోనూ ఒకే ప్రాసెసర్ ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్లలో మీడియాటెక్ హీలియో పీ 22 ప్రాసెసర్‌ను అమర్చింది. ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 13 ఎంపీ రియర్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో స్మార్ట్ బ్యాక్లిట్ హెచ్‌డీఆర్, నైట్ ఫిల్టర్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసింది. ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ లేదు. ఏఐ ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్‌లో 4230 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మైక్రో ఎస్‌డీ కార్డు వేసుకోవచ్చు. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తోంది. ఆండ్రాయిడ్ 11 కలర్ ఓఎస్ 11.1 ఓఎస్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. అందుబాటు ధరలో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

First published:

Tags: Latest offers, Mobile offers, Offers, Oppo, Smartphones

ఉత్తమ కథలు