Oppo A16: ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.15,000 లోపే

Oppo A16: ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.15,000 లోపే (image: Oppo India)

Oppo A16 | రూ.15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇండియాలో ఒప్పో ఏ16 (Oppo A16) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ధర, ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. రూ.15,000 లోపు బడ్జెట్‌లో కొత్త మొబైల్‌ను పరిచయం చేసింది ఒప్పో. ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో ఏ16 (Oppo A16) రిలీజ్ చేసింది. ఇది గతేడాది ఇండియాలో విడుదలైన ఒప్పో ఏ15 (Oppo A15) మోడల్‌కు అప్‌గ్రేడ్ వర్షన్. బడ్జెట్ కేటగిరీలో ఒప్పో ఏ16 మోడల్‌ను రిలీజ్ చేసింది ఒప్పో. ఇప్పటికే మార్కెట్‌లో రూ.15,000 బడ్జెట్‌లో చాలా స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. రియల్‌మీ 8, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ 10 ప్రైమ్, పోకో ఎం3 ప్రో లాంటి మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు రూ.13,990 ధరకు ఒప్పో ఏ16 వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 13మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

    ఒప్పో ఏ16 ఆఫర్


    కేవలం 4జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే ఒప్పో ఏ16 రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కాగానే సేల్ కూడా ప్రారంభమైంది. అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డులతో కొంటే రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్స్, టీవీఎస్ క్రెడిట్, హోమ్ క్రెడిట్, మహీంద్రా ఫైనాన్స్ లాంటి ఫైనాన్సర్లతో మూడు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌తో ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

    WhatsApp New Feature: వాట్సప్ గ్రూప్స్‌లో ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

    ఒప్పో ఏ16 స్పెసిఫికేషన్స్


    ఒప్పో ఏ16 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.52 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. డిస్‌ప్లేలో ఐకేర్ మోడ్ ఫీచర్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ర్యామ్ 4జీబీ కాగా, స్టోరేజ్ 64జీబీ. మైక్రో ఎస్‌డీ కార్డుతో 256జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

    Realme GT Master Edition: రూ.25,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

    ఒప్పో ఏ16 ఫీచర్స్


    ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. స్మార్ట్ బ్యాటరీ ప్రొటెక్షన్ ఫీచర్స్ ఉన్నాయి. డ్యూయెల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వర్షన్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, ఫేస్ అన్‌లాక్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 190 గ్రాములు. ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్‌ను క్రిస్టల్ బ్లాక్, పెరల్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: