OPPO A15 2GB AND 32GB VARIANT RELEASED KNOW PRICE AND SPECIFICATIONS SS
Oppo A15: రూ.10,000 లోపే ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
Oppo A15: రూ.10,000 లోపే ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
(image: Oppo India)
Oppo A15 | పండుగ సీజన్లో సేల్స్ పెంచుకునేందుకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఒప్పో నుంచి ఒప్పో ఏ15 కొత్త వేరియంట్ వచ్చేసింది.
రూ.10,000 లోపే బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇప్పటికే ఒప్పో ఏ15 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఉంది. 3జీబీ+32జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను గత నెలలోనే రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,990. ఇప్పుడు 2జీబీ+32జీబీ వేరియంట్లో కొత్త మోడల్ని పరిచయం చేసింది ఒప్పో ఇండియా. ఈ ఫోన్ ధర రూ.9,490 మాత్రమే. రెండు కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ రిలీజైంది. ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు వివో ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్స్‌లో ఈ ఫోన్ కొనొచ్చు. 7.9ఎంఎం సైజ్‌లో ఉండే సన్నని స్మార్ట్‌ఫోన్ ఇది. 6.52 అంగుళాల వాటర్‌డ్రాప్ డిస్ప్లే, 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీ+ రెజల్యూషనల్, ట్రిపుల్ రియర్ కెమెరా, మీడియాటెక్ హీలియో పీ35 ఆక్టాకోర్ చిప్సెట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్ కెమెరాలో నేచురల్ బ్యూటీ, ఏఐ బ్యూటిఫికేషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక కలర్ ఓఎస్ 7.2 ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్, త్రీ ఫింగర్ స్క్రోలింగ్ స్క్రీన్ షాట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
The #OPPOA15 2GB is here! With a sleek curved design, Triple camera, an HD+ 16.55cm Waterdrop Eye Protection Screen and much more.
Available at just ₹9,490! pic.twitter.com/rsX2m81PAz
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.