OPPO A11S PRICE CNY 999 LAUNCH SALE DATE SPECIFICATIONS FEATURES GH VB
New Mobile From Oppo: ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు..
ప్రతీకాత్మక చిత్రం
Oppo: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఏ సిరీస్ నుంచి బడ్జెట్ సెగ్మెంట్లో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. అంతేకాదు దీనికి సంబంధించి ఫీచర్లు కూడా అదిరిపోయాయి. వివరాలిలా..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఏ సిరీస్ నుంచి బడ్జెట్ సెగ్మెంట్లో ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ఒప్పో A11s (Oppo A11s) పేరుతో దీన్ని చైనా మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఒప్పో A11s కొత్త మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, 90Hz హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్‌తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 460 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2019లో లాంచ్ అయిన ఒప్పో A11 స్మార్ట్‌ఫోన్‌కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ విడులైంది.
ఒప్పో A11s ధర, లభ్యత..
ఒప్పో A11s బేస్ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ CNY 999 (దాదాపు రూ. 11,800) వద్ద లభిస్తుంది. ఇక, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ CNY 1,199 (దాదాపు రూ. 14,100) వద్ద అందుబాటులో ఉంటుంది. డ్రీమ్ వైట్, మ్యాట్ బ్లాక్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో చైనా వెబ్సైట్ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో A11s స్పెసిఫికేషన్లు..
ఒప్పో A11s డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 కలర్ ఓఎస్ 7.2పై రన్ అవుతుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 -అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 460 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో A11s ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.
దీనిలో 2- మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 -మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో పాటు 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాలతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం, దీని ముందు భాగంలో 8 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది.
ఒప్పో A11s స్మార్ట్‌ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 4జీ ఎల్టీఈ, వైఫై 802.11ac, బ్లూటూత్ v5, జీపీఎస్, యూఎస్బీ టైప్- సీ, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి అందించింది. బోర్డ్‌లోని సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వంటివి చేర్చింది. ఇక, ఫోన్ వెనుకవైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్లను కూడా చేర్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.