హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ChatGPT Vs Bard: చాట్‌జీపీటీ, బార్డ్‌లో ఏది బెస్ట్‌? గూగుల్, మైక్రోసాఫ్ట్‌ల ఓపెన్ ఏఐ సర్వీసులో తేడాలేంటి?

ChatGPT Vs Bard: చాట్‌జీపీటీ, బార్డ్‌లో ఏది బెస్ట్‌? గూగుల్, మైక్రోసాఫ్ట్‌ల ఓపెన్ ఏఐ సర్వీసులో తేడాలేంటి?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) చాట్‌బాట్ టెక్నాలజీ.. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ(ChatGPT)ని తీసుకురాగా, దీనికి పోటీగా గూగుల్ ‘బార్డ్’(Bard) చాట్‌బాట్‌ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో రెండింటికి మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.  

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(AI) చాట్‌బాట్ టెక్నాలజీ.. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ(ChatGPT)ని తీసుకురాగా, దీనికి పోటీగా గూగుల్ ‘బార్డ్’(Bard) చాట్‌బాట్‌ని తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో రెండింటికి మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మరి ఈ రెండిట్లో ఏది బెటర్? ఈ చాట్‌బాట్‌ల ద్వారా గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు అందిస్తున్న సేవల మధ్య ఏమైనా పోలికలున్నాయా? వంటి విషయాలను తెలుసుకుందాం.

ప్రధాన తేడా ఇదే

గూగుల్ రూపొందిస్తున్న ‘బార్డ్’ అనేది లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్(LaMDA), వెబ్ కంటెంట్‌ని ఉపయోగించుకుని యూజర్లకు సేవలందిస్తుంది. అంటే యూజర్ భాషలోనే ఏ సమాచారాన్నైనా అందిస్తుంది. వీలైనన్ని ఎక్కువ భాషల్లో వినియోగదారులకు సేవలు అందించాలనే లక్ష్యంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ఏ ప్రశ్న వేసినా అందుకు అనుగుణమైన, కచ్చితమైన, అధునాతన సమాచారాన్ని చేరవేస్తుంది. ఒక ప్రశ్నకు అరటిపండును వొలిచి నోట్లో పెట్టినట్లు సమాధానం ఇస్తుంది.

AI Photos : భూమిపై సన్‌ఫ్లవర్స్ దండయాత్ర.. కృత్రిమ మేథస్సు క్రియేటివిటీ

మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీ 3.5 వెర్షన్ కూడా దాదాపుగా గూగుల్ LaMDA వంటిదే. యూజర్‌కు అర్థమయ్యే విధంగా సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ విషయంలో గూగుల్, మైక్రోసాఫ్ట్ దాదాపు ఒకే విధంగా సేవలు అందించనున్నాయి. కాకపోతే, మైక్రోసాఫ్ట్‌లో ఒక లోపం ఉంది. 2021 వరకు మాత్రమే చాట్‌జీపీటీ నాలెడ్జ్ లాక్ అయి ఉంది. అంటే 2021 తర్వాత జరిగిన ఘటనలు, ఈవెంట్లకు సంబంధించిన అంశాల గురించి చాట్‌జీపీటీ వివరంగా సమాచారం అందించలేదు. సరిగ్గా ఈ సమస్యనే గూగుల్ అడ్వాంటేజీగా తీసుకుని ఒక మెట్టు పైన నిలిచింది.

ఇంకా రెడీ కాలేదు

చాట్‌జీపీటీ ప్రస్తుతం అత్యున్నతంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టెక్నాలజీకి మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు. ఒక్కో లోపాన్ని సవరించుకుంటూ అత్యాధునికంగా తీర్చిదిద్దారు. దీంతో యూజర్లకు మెరుగైన సేవలు అందుతున్నాయి. మరోవైపు, గూగుల్ ‘బార్డ్’ ఇంకా పూర్తిగా సన్నద్ధం కాలేదు. కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నందున మరింతగా చేరవేయాల్సి ఉంది. మరికొన్ని కంప్యూటేషనల్ రీసోర్స్‌లు కావాల్సి ఉంటుంది. మరింత ఫీడ్‌బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఆరోపణలు

గూగుల్ ఉపయోగిస్తున్న ‘LaMDA’పై కంపెనీ ఉద్యోగి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. గూగుల్ ఇంజినీర్ బ్లేక్ లిమోయిన్.. ‘LaMDA బుద్ధిమంతుడిగా ఉండేవాడు’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో కంపెనీ లిమోయిన్‌ని ఉద్యోగంలో నుంచి తీసేసింది. అయితే, లిమోయిన్ వ్యాఖ్యలు ఏఐ సమర్థతపై అనుమానాలు కలిగించేలా ఉండటం గమనార్హం. మరోవైపు, మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీపై ఈ తరహా ఆరోపణలు ఉండకపోవడం విశేషం.

మెరుగైన సేవలు

గూగుల్ ‘బార్డ్’ చాట్‌బాట్‌కి ప్రస్తుతమున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రధాన బలంగా మారనుంది. అత్యధిక యూజర్లు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ని వినియోగిస్తున్నారు. సులువుగా, అత్యధికంగా కావాల్సిన సమాచారాన్ని గూగుల్ సెర్చ ఇంజిన్‌తో పొందుతున్నారు. ఫలితంగా ఈ సెర్చ్ ఇంజిన్‌ని ‘బార్డ్’కి ఇంటిగ్రేట్ చేయనున్నారు. దీంతో సెర్చ్ ఇంజిన్ నుంచి సమాచారాన్ని క్రోఢీకరించి మరింత మెరుగైన సేవలను ‘బార్డ్’ అందించేందుకు ఉపయోగపడుతుంది. పైగా గూగుల్‌కి ఉన్న వనరులతో యూజర్‌‌ని నిరంతరాయ సేవలు అందించవచ్చు. క్షణాల్లోనే అడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం అందించగలదు. అయితే, మైక్రోసాఫ్ట్ కూడా తన సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’తో ఇంటిగ్రేట్ చేసినప్పటికీ యూజర్ బేస్ తక్కువగా ఉండటం, గూగుల్‌ కన్నా మెరుగైన సెర్చ్ ఇంజిన్ సేవలు అందించలేకపోవడం వంటివి చాట్‌జీపీటీకి మైనస్ పాయింట్‌లుగా మారాయి.

ఇప్పుడే తేల్చడం కష్టం

చాట్‌జీపీటీ, బార్డ్‌ల మధ్య ఏది అత్యుత్తమం అని ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ప్రస్తుతం బార్డ్ కొంతమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మరోవైపు, చాట్‌జీపీటీ ఓపెన్ సోర్స్‌లోకి వచ్చేసింది. దీంతో గూగుల్ ‘బార్డ్’ అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చాకే రెండింట్లో ఏది బెటర్ అనే విషయాన్ని నిర్ధారించగలం అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Artificial intelligence, Chatgpt

ఉత్తమ కథలు