ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చించుకుంటున్న టెక్నాలజీ టూల్ ChatGPT. ఈ లేటెస్ట్ చాట్‌బాట్ వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు అందిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. భవిష్యత్తులో AI డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ టూల్ నుంచి భవిష్యత్తులో మరిన్ని సంచలనాలను ఆశించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. AI- పవర్డ్ ChatGPT చాట్‌బాట్‌ను మైక్రోసాఫ్ట్-బ్యాక్డ్ AI రీసెర్చ్ అండ్ డెప్లాయ్‌మెంట్ కంపెనీ OpenAI అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ChatGPT సేవలను పొందేందుకు పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ChatGPT ప్లస్ అనే కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ నెలకు 20 డాలర్లు(దాదాపు రూ.1638)కి అందుబాటులో ఉంటుంది.
* త్వరలో ఇతర దేశాలకు అందుబాటులో
కంపెనీ తెలిపిన వివరాల మేరకు.. ChatGPT పైలట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. కన్వర్జేషనల్ AI వినియోగదారులతో చాట్ చేస్తుందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదని, ఇన్‌కరెక్ట్ అసంప్షన్స్‌ను ఛాలెంజ్ చేస్తుందని పేర్కొంది. ChatGPT ప్లస్ యూఎస్‌లోని కస్టమర్‌లకు అందుబాటులో ఉందని, రాబోయే వారాల్లో వెయిట్‌లిస్ట్‌లోని వినియోగదారులను ఆహ్వానించే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపింది. త్వరలో అదనపు దేశాలు, ప్రాంతాలకు యాక్సెస్, సపోర్ట్ ఎక్స్‌పాండ్ చేసే ఆలోచనలో ఉన్నామని కంపెనీ స్పష్టం చేసింది.
* వినియోగదారులకు ప్రయోజనాలు
OpenAI సబ్‌స్క్రైబర్లు అనేక ప్రయోజనాలను పొందుతారు. ChatGPT జనరల్ యాక్సెస్, పీక్ సమయాల్లో కూడా వేగవంతమైన ప్రతిస్పందన, కొత్త ఫీచర్లు, ఇంప్రూవ్‌మెంట్స్ అందుకుంటారు. కంపెనీ ChatGPTకి ఫ్రీ యాక్సెస్‌ను అందించడం కొనసాగిస్తుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ధరను అందించడం ద్వారా, వీలైనంత ఎక్కువ మంది వ్యక్తులకు ఫ్రీ యాక్సెస్ అందించే అవకాశం ఉంటుంది.
కంపెనీ తన వెబ్‌సైట్‌లో.. ChatGPTని రీసెర్చ్ ప్రివ్యూగా ప్రారంభించాం. అందువల్ల మేము సిస్టమ్ బలాలు, బలహీనతల గురించి మరింత తెలుసుకోవచ్చు. దాని పరిమితులను మెరుగుపరచడంలో మాకు సహాయపడటానికి మిలియన్ల మంది వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ని సేకరించాం. మేము అనేక ముఖ్యమైన అప్‌డేట్‌లను చేశాం. కంటెంట్ డ్రాఫ్టింగ్ & ఎడిటింగ్, బ్రైన్‌స్టార్మింగ్ ఐడియాస్, ప్రోగ్రామింగ్ హెల్స్, కొత్త విషయాలను నేర్చుకోవడం వంటివి అందించామని పేర్కొంది.
OpenAI ఇటీవల 'ది AI టెక్స్ట్ క్లాసిఫైయర్' అనే కొత్త టూల్ ప్రారంభించింది. ఇది AI- జనరేటెడ్ కంటెంట్‌ను గుర్తించగలదు. AI టెక్స్ట్ క్లాసిఫైయర్ అనేది ఫైన్ ట్యూన్డ్ GPT మోడల్. ఇది ChatGPT వంటి వివిధ AI సోర్సెస్ ద్వారా జనరేట్ చేసిన టెక్స్ట్‌ను సులువుగా గుర్తిస్తుంది. ఇన్‌పుట్ టెక్స్ట్ లెంత్ పెరిగే కొద్దీ AI టెక్స్ట్ క్లాసిఫైయర్ విశ్వసనీయత సాధారణంగా మెరుగుపడుతుంది. మునుపు విడుదల చేసిన క్లాసిఫైయర్‌తో పోలిస్తే, ఈ కొత్త టూల్ మెరుగైన ఫలితాలు అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Latest Technology, Microsoft, Tech news, Technology