కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మతక ప్రాజెక్ట్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ప్రారంభించింది. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్. ప్రస్తుతం బెంగళూరులో బీటా టెస్టింగ్ ప్రారంభమైంది. బెంగళూరులో (Bengalore) 16 పిన్ కోడ్స్‌కు ఓఎన్‌డీసీ ప్రారంభమైంది. 200 పైగా గ్రాసరీ స్టోర్లు, రెస్టారెంట్‌లు ఈ ట్రయల్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఇది ట్రయల్ మాత్రమే. కొందరు యూజర్లకు మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్‌కు మెరుగులు దిద్దుతామని ఓఎన్‌డీసీ ఎండీ, సీఈఓ టీ కోషీ తెలిపారు. ఈ నెట్వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు.
అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ లాంటి దిగ్గజ ఇ-కామర్స్ సంస్థల ఆధిపత్యం, ప్రభావం తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌డీసీని ప్రారంభించింది. చిరువ్యాపారులు, స్టోర్లు ఈ నెట్వర్క్‌లో చేరి తమ ప్రొడక్ట్స్ అమ్మొచ్చు. సేవల్ని ఆఫర్ చేయొచ్చు. ఎలాంటి కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ ప్లాట్‌ఫామ్ ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఓఎన్‌డీసీతో అనుసంధానం అయ్యారనుకుందాం. ఓ కస్టమర్ స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్ టీవీ కోసం అమెజాన్‌లో సెర్చ్ చేస్తే, అదే మోడల్ టీవీ లేదా స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నట్టైతే ఆ వివరాలు కూడా కనిపిస్తాయి. ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడ కస్టమర్ కొనొచ్చు. అన్ని వస్తువులు, సేవలు ఇలాగే తక్కువ ధరకు పొందడానికి ఓఎన్‌డీసీ ప్లాట్‌ఫామ్ ఉపయోగపడుతుంది.
Flipkart Sale: లేటెస్ట్ 5జీ మొబైల్‌పై రూ.10,000 డిస్కౌంట్... ఆఫర్ ఇంకొన్ని గంటలే
#ONDC starts beta testing in Bengaluru today, with 3 buyer apps, 11 seller apps, 3 logistics providers across 16 pin codes for grocery and food domains. Many more apps are in the process of joining the network. Valuable experience to be gained for further improvements. pic.twitter.com/dPmbmOuq39
— DPIIT India (@DPIITGoI) September 30, 2022
బెంగళూరు ట్రయల్స్‌లో పేటీఎం, మైస్టోర్, స్పైస్ మనీ బయర్ సైడ్ యాప్స్‌గా చేరాయి. 11 సెల్లర్ యాప్స్, 3 లాజిస్టిక్స్ ప్రొవైడర్స్ 16 పిన్‌కోడ్స్‌లో గ్రాసరీ, ఫుడ్ డెలివరీ సేవల్ని అందించనున్నాయి. యూజర్లు సైనప్ అయిన తర్వాత ఈ నెట్వర్క్ ద్వారా ఆర్డర్స్ చేయొచ్చు. బెంగళూరు బీటా టెస్టింగ్‌లో వినియోగదారులు చేరడం ఒకేసారిగా కాకుండా దశలవారీగా జరగనుంది.
సెల్లర్ యాప్‌లో 50 మంది ఇప్పటికే చేరారు. ఇందులో 31 కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్, కపివ, బోల్డ్‌కేర్, ట్రూనెక్స్‌ట్, పతంజలి లాంటి 12 డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్స్ ఉన్నాయి. సెల్లర్ ప్లాట్‌ఫామ్‌లో సెకండ్‌కు 1,000 సెర్చ్ రిక్వెస్ట్‌లు, సెకండ్‌కు 100 ఆర్డర్స్ టెస్ట్ చేశారు. అయితే టెక్నాలజీ పరంగా అనేక సమస్యల్ని పరిష్కరించినా, ఇప్పుడు ఓఎన్‌డీసీలో చేరినవారి ముందు ఉన్న పెద్ద సవాల్ యూజర్లను ఆకర్షించడమే. క్లోజ్డ్ లూప్ ప్లాట్‌ఫామ్స్ భారీ డిస్కౌంట్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. మరి ఓఎన్‌డీసీలో చేరేవారు కస్టమర్లను ఎలా ఆకట్టుకుంటారన్నది చూడాలి.
OnePlus Smart TV: 50 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ... కేవలం రూ.25,000 లోపే
భారతదేశంలో ప్రస్తుతం ఇ-కామర్స్ 8 శాతమే విస్తరించి ఉంది. ఓఎన్‌డీసీ ద్వారా రెండేళ్లలో ఇ-కామర్స్ వినియోగాన్ని 25 శాతానికి తీసుకెళ్లాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఐదేళ్లలో 12 లక్షల మంది సెల్లర్స్, 90 కోట్లమంది కొనుగోలుదారుల్ని ఈ ప్లాట్‌ఫామ్‌లో చేర్చాలన్న ప్రణాళికలు ఉన్నాయి. 20 పైగా సంస్థలు ఈ నెట్వర్క్‌లో రూ.225 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూకో బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: E-commerce, ONDC, Online shopping