Twitter: దిగ్గజ పారిశ్రామికవేత్త, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్(Twitter)ను కొనుగోలు చేసిన సమయం నుంచి దానిలో సరికొత్త మార్పులను తీసుకొస్తున్నారు. వెరిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరూ డబ్బులు చెల్లించేలా ఇప్పటికే మార్పులను తీసుకురాగా, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 15 నుంచి కేవలం వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్స్ మాత్రమే పోల్స్(Polls)లో ఓట్లు వేయడం కుదురుతుందని ప్రకటించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి లేదా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ అకౌంట్స్ అయిన బాట్స్ సమస్యను పరిష్కరించడానికే ఈ మార్పు తీసుకొస్తున్నామని వివరించారు.
వెరిఫైడ్ అకౌంట్స్(Verified Accounts)కు మాత్రమే పోల్స్‌ను పరిమితం చేయడం ద్వారా, ప్లాట్‌ఫామ్‌పై బాట్స్ ప్రభావాన్ని తగ్గించాలని ట్విట్టర్ సీఈఓ మస్క్ భావిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 15 నుంచి వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్ల పోస్ట్స్ మాత్రమే ప్లాట్‌ఫామ్‌లోని "ఫర్ యు (For You)" రికమండేషన్ ట్యాబ్‌లో కనిపిస్తాయని కూడా మస్క్ ప్రకటించారు. అధునాతన AI బాట్స్ సమస్యను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
AI బాట్స్ ట్విట్టర్ కంటెంట్‌ను మార్చగలవు, ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయగలవు. అయితే "ఫర్ యు" రికమండేషన్లను సైతం వెరిఫైడ్ అకౌంట్స్‌కే పరిమితం చేయడం ద్వారా ప్లాట్‌ఫామ్‌పై బాట్స్ ఆధిపత్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని మస్క్ విశ్వసిస్తున్నారు.
వెరిఫైడ్ అకౌంట్స్ అనేవి నిజమైన వ్యక్తులు, సంస్థలకు చెందినవి అయి ఉంటాయి. దీనివల్ల "ఫర్ యు" ట్యాబ్ ద్వారా ఆ నిజమైన అకౌంట్స్ మాత్రమే ట్విట్టర్ యూజర్లకు చేరువవుతాయి. మానిప్యులైట్ చేసే బాట్స్ ఏప్రిల్ 15 నుంచి రికమండేషన్ ట్యాబ్‌లో కనిపించవు. అంతేకాకుండా ఈ బాట్స్ దేనిని తారుమారు చేయకుండా ఆపేందుకు ట్విట్టర్ పోల్స్‌లో పాల్గొనడానికి వెరిఫికేషన్ అవసరమని మస్క్ పేర్కొన్నారు.
Demat Nomination: ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ నామినేషన్స్‌కు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
ప్లాట్‌ఫామ్ నియమాలను అనుసరించి, మనుషులుగా నటించనంత వరకు వెరిఫైడ్ బాట్స్ అకౌంట్స్‌తో తమకు అభ్యంతరమేమీ లేదని మస్క్ చెప్పుకొచ్చారు. దీనర్థం ఏదైనా ఒక బాట్ అకౌంట్ ట్విట్టర్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకుని.. నిబంధనలను అనుసరిస్తే, అది ఎటువంటి సమస్యలను కలిగించకుండా ప్లాట్‌ఫామ్‌లో ఉండవచ్చు. కానీ ఆ బాట్ మనుషులుగా నటిస్తూ ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నించకూడదు.
అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నిక్‌లను ఉపయోగించడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో బాట్స్‌ను రూపొందించడానికి, రన్ చేయడానికి అయ్యే ఖర్చును తగ్గించుకోచ్చని మస్క్ వ్యాఖ్యానించారు. దీనివల్ల చాలామంది బాట్స్‌ను ఉపయోగించే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఖాతాల కోసం పెయిడ్ వెరిఫికేషన్‌ను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. దీనివల్ల బాట్‌లను క్రియేట్ చేసి, వాటిని రన్ చేయడానికి అయ్యే ఖర్చు 10,000 శాతం పెరుగుతుందన్నారు. ఫలితంగా వీటిని రన్ చేయడానికి ఎవరూ ముందుకు రారనట్లు వ్యాఖ్యానించారు. అలానే పెయిడ్ వెరిఫికేషన్‌తో బాట్‌లను గుర్తించడం, ట్రాక్ చేయడం సులభతరం అవుతుందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.