Online Shopping: డిస్కౌంట్లు, ఆఫర్ల వెనుక అసలు కథేంటో తెలుసా?

Online Shopping | ఒక వస్తువు ధరెంతో కంపెనీ నిర్ణయించడం కాదు... మీరు కొనాలనుకునే వస్తువుపై కాస్త అధ్యయనం చేసి... దానికి మీరే ఓ విలువ కట్టండి. మీరు అనుకున్న ధరకే వస్తువు వస్తే కొనండి. అంతే తప్ప డిస్కౌంట్లను నమ్మకండి.

Santhosh Kumar S | news18-telugu
Updated: January 21, 2019, 2:18 PM IST
Online Shopping: డిస్కౌంట్లు, ఆఫర్ల వెనుక అసలు కథేంటో తెలుసా?
ఈ- కామర్స్ సైట్లు ఇష్టారాజ్యంగా భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి కుదరదు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు పోటీపడి భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. అయితే, ఆయా కంపెనీలకు వాటాలున్న సంస్థలకు చెందిన ఉత్పత్తులను సంబంధిత ఈ- కామర్స్ ప్లాట్ ఫామ్ మీద విక్రయించడానికి వీల్లేకుండా కేంద్రం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇది కూడా ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఇకపై కస్టమర్లకు ఈ- కామర్స్ సైట్లలో భారీ డిస్కౌంట్లు ఉండవు.
  • Share this:
ఏ పండుగ వచ్చినా ఆ ఆఫర్, ఈ ఆఫర్ అంటూ ఇ-కామర్స్ సైట్లు ఊరించడం మామూలే. వద్దూ వద్దనుకుంటేనే... షాపింగ్ సైట్స్, యాప్స్ ఓపెన్ చేయడం అలవాటు. ఏం కొనాలని లేకున్నా... ఊరికే చూద్దామని యాప్ ఓపెన్ చేసి చివరకు ఏదో ఓ ఆఫర్‌కు టెంప్ట్‌ అయిపోయి అవసరం లేనివి కూడా కొనేస్తుంటారు. ఆ తర్వాత అనవసరంగా కొన్నాం కదా అని ఫీలవుతుంటారు. "ఇప్పుడు మీరు అవసరం లేని వస్తువుల్ని కొంటూ పోతూ ఉంటే... కొన్నాళ్ల తర్వాత మీకు అవసరమైన వస్తువుల్ని కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి వస్తుంది" అని అపర కుబేరుడు వారెన్ బఫెట్ చెప్పిన మాట అక్షరాలా నిజం. ఆన్‌లైన్ షాపింగ్‌లో చాలామంది పరిస్థితి ఇదే. అవసరం లేకున్నా కొంటూనే ఉంటారు. అందుకే ఆన్‌లైన్‌ షాపింగ్‌ని వ్యసనంగా చెప్పుకుంటారు. మరి మీకూ ఆ వ్యసనం ఉందా? ఆన్‌లైన్ షాపింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? ఆఫర్ల వెనకున్న మాయాజాలమేంటీ? తెలుసుకోండి.

Amazon, festival sale, discounts, tips, coupons, Flipkart Big Billion Days sale, offers, deals, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్స్, డీల్స్, అమెజాన్, ఫెస్టివల్ సేల్

సేల్ పేరుతో ఇ-కామర్స్ సైట్లు చేసుకునే ప్రచారం వెనుక ఓ వ్యూహం ఉంటుంది. 90% వరకు డిస్కౌంట్ ఇస్తామని ప్రకటిస్తాయి కొన్ని కంపెనీలు. ఇక్కడే మీరు ఓ విషయం గుర్తుంచుకోవాలి. 90% అంటే ఆ వస్తువు గరిష్ట రీటైల్ ధర(ఎంఆర్‌పీ)లో 90%. అయితే ఎంఆర్‌పీ ఎంత అన్నది కంపెనీనే నిర్ణయిస్తుంది. ఎంత వరకు అమ్ముకోవచ్చో ఇ-కామర్స్ సైట్లకు సెల్లర్స్ సూచిస్తారు. సో... అక్కడ డిస్కౌంట్ ఎంత శాతం అన్నది ముఖ్యం కాదు.

మీరు కొనాలనుకున్న వస్తువు ఎంత విలువ చేస్తుందన్న అవగాహన మీకు ఉండాలి. ఒకవేళ మీరు అంచనా వేసిన విలువ కన్నా అది తక్కువ ధరకు వస్తుందనుకుంటే దర్జాగా కొనుక్కోవచ్చు. అంతేకానీ... ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తున్నారన్నది చూడాల్సిన అవసరం లేదు.


ఇవి కూడా చదవండి:

Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?నిజంగా ఏదైనా కంపెనీ 90% డిస్కౌంట్ ఇస్తుందంటే ఆ కంపెనీ దివాళా తీయాల్సిందే. ధర పెంచి డిస్కౌంట్ ఇస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏ కంపెనీ కూడా నష్టాలకు తమ వస్తువుల్ని అమ్ముకోదు. ఎంతో కొంత లాభం చూసుకుంటుందన్నది వాస్తవం. సో... మీరు కొనాలనుకున్న వస్తువుపై ఓ ధర నిర్ణయించారంటే అందులో వ్యాపారుల లాభం కూడా కలిపే ఉంటుంది. క్లియరెన్స్ సేల్ అని చెప్పినా వ్యాపారుల లాభం వ్యాపారులకు ఉంటుంది. కాకపోతే ఆ వస్తువు మీరు అనుకున్న ధరలోనే వస్తుందా లేదా అన్నది చూసుకుంటే చాలు. ఆఫర్లకు టెంప్ట్ అవ్వాల్సిన అవసరం లేదు.

Amazon, festival sale, discounts, tips, coupons, Flipkart Big Billion Days sale, offers, deals, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్స్, డీల్స్, అమెజాన్, ఫెస్టివల్ సేల్

రూ.1,000 విలువ చేసే వస్తువును సేల్ సమయంలో రూ.300 అమ్ముతున్నట్టు కొన్నిసార్లు ఇ-కామర్స్ సైట్లు ప్రకటిస్తుంటాయి. నిజానికి ఆ వస్తువు రేటు మీరు చూసినప్పుడు రూ.1,000 ఉంటుంది. సేల్ సమయంలో రూ.300 ధరకే ఇ-కామర్స్ సైట్ అమ్ముతుందన్న దాంట్లో అసత్యం కూడా ఉండదు. అయితే ఇక్కడే కంపెనీ కస్టమర్లకు గాలం వేస్తుంది. రూ.300 ధరకు అమ్మేది కొన్ని వస్తువుల్ని మాత్రమే. అందుకే 'స్టాక్ ఉన్నంత వరకే' అన్న నిబంధన పెడుతుంది. అందుకే అలాంటి వస్తువులు సేల్ మొదలైన కొన్ని క్షణాల్లోనే 'సోల్డ్ అవుట్' అని కనిపిస్తుంటాయి. అమ్మేది కొన్ని వస్తువులే అయినా భారీ తగ్గింపు అనే ప్రచారంతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.

ఇవి కూడా చదవండి:

Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా

కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి

సేల్స్ సమయంలో కొన్ని వేల ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపు అని ప్రచారం చేస్తుంటాయి ఇ-కామర్స్ సైట్లు. అయితే అందులో కొంతవరకే నిజం ఉంటుంది. కొన్ని వస్తువులపై మాత్రమే డిస్కౌంట్ ఇచ్చి... మిగతా వస్తువుల్ని పాత ధరకే అమ్ముతుంటాయి. సేల్ పేరుతో కస్టమర్లను అట్రాక్ట్ చేయడం అన్నది వ్యాపార వ్యూహం. సేల్ సమయంలో యాప్ చూసే వారికి గతంలో ఎంత ధర ఉంది? ఇప్పుడు ధర ఎంత? అన్న అవగాహన ఉండదు.

యాప్‌లో, సైట్‌లో కస్టమర్ ఎక్కువ సేపు బ్రౌజ్ చేస్తూ ఉండటం వల్ల కొనాలనుకున్న వస్తువులతో పాటు మిగతావాటికీ అట్రాక్ట్ అవుతుంటారు. ఒక వస్తువు కొనాలనుకొని ఇంకో రెండు వస్తువులూ ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. అలా సేల్ సమయంలో ఇ-కామర్స్ సైట్లు తమ వ్యాపారాన్ని పెంచుకుంటాయి.


మీరు ఏ వస్తువు కొనాలనుకుంటున్నారో దానిపై కనీసం రెండు వారాలైనా అధ్యయనం చేయండి. మిగతా సైట్లల్లో ధరలెలా ఉన్నాయో పోల్చి చూసుకోండి. ఒక ఇ-కామర్స్ సైట్‌లో రూ.1,000 ఉన్న వస్తువు మరో సైట్‌లో రూ.600 కే రావచ్చు. అందుకే నాలుగైదు సైట్లల్లో ధరల్ని పోల్చిచూడండి. ఒక వస్తువును మీరు ఖచ్చితంగా కొనాలని నిర్ణయించుకుంటే... అది అత్యవసరం కాకపోతే సేల్ జరిగే వరకు ఆగొచ్చు. ఎందుకంటే ఇ-కామర్స్ సైట్లు నెలకోసారి ఏదో ఓ సందర్భంలో సేల్ నిర్వహిస్తుంటాయి. ఆ సమయంలో మీకు కావాల్సిన వస్తువు కాస్త తక్కువ ధరకే రావొచ్చు.

Amazon, festival sale, discounts, tips, coupons, Flipkart Big Billion Days sale, offers, deals, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆఫర్స్, డీల్స్, అమెజాన్, ఫెస్టివల్ సేల్

కొన్ని క్రెడిట్ కార్డులపై 10 % వరకు డిస్కౌంట్లు ఇస్తుంటాయి ఇ-కామర్స్ సైట్లు. ఆ కార్డు మీ దగ్గర ఉంటే 10% లాభం. అయితే ఒకరి దగ్గర అన్ని కార్డులూ ఉండవు. ఇ-కామర్స్ సైట్ ఎప్పుడు ఏ కార్డుపై డిస్కౌంట్ ఇస్తుందో తెలియదు. అయితే కొన్ని సైట్లు సొంతగా వ్యాలెట్ సేవల్ని అందిస్తుంటాయి. కార్డుతో సంబంధం లేకుండా వ్యాలెట్ ద్వారా చెల్లించినా డిస్కౌంట్ పొందొచ్చు. 'నో కాస్ట్ ఇఎంఐ' సదుపాయం కూడా కస్టమర్లను ఊరించేదే. నిజంగా మీకు ఓ ఫోనో, టీవీనో అవసరం ఉంటే... వాయిదాల పద్ధతిలో తీసుకోవాలనుకుంటే మాత్రం 'నో కాస్ట్ ఈఎంఐ' ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

కదిలే రైలులో బెర్తు ఖాళీగా ఉందా? ఇక ఈజీగా తెలుసుకోవచ్చు

ఇది కూడా చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఎక్కడ ఉందో ఇలా తెలుసుకోవచ్చు

కస్టమర్లను తమ సైట్‌లోకి, యాప్‌లోకి తీసుకురావాలన్నది ఇ-కామర్స్ సైట్లు నిర్వహించే ఫెస్టివల్ సేల్స్ లక్ష్యం. ఆ తర్వాత కస్టమర్లు భారీ డిస్కౌంట్లకు అట్రాక్ట్ అవుతారు. డిస్కౌంట్ల మాయలో పడి ఎక్కువగా షాపింగ్ చేసేస్తారు. తక్కువ ధరకే వస్తుంది కదా అని అవసరం లేని వస్తువులు కొంటారు.


ఫెస్టివల్ ఆఫర్స్ పేరుతో ఒక్కసారిగా ఎక్కువమంది కస్టమర్లను ఆకట్టుకొని భారీగా వ్యాపారం చేసుకోవడమే ఇ-కామర్స్ సైట్ల వ్యూహం. ఈ సేల్స్ ద్వారా సాధారణంగా నెల రోజుల్లో జరిగే వ్యాపారాన్ని... మూడునాలుగు రోజుల్లో చేస్తుంటాయి.

మీకు ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనంగా మారినట్టు అనిపిస్తే... వెంటనే మీ ఫోన్‌లో ఇ-కామర్స్ యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేసెయ్యండి. మీరు అత్యవసరంగా ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆ యాప్ మీ ఫోన్‌లో లేనంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదు. మీకే ఇంకా మంచిది కూడా. డబ్బు, సమయం రెండూ ఆదా అవుతాయి.

ఇవి కూడా చదవండి:

మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారా? ఈ 12 టిప్స్ మీ కోసమే

ఇది కూడా చదవండి: Budget 2019: భారతీయులందరూ చెల్లించే పన్నులు ఇవే... మీకెన్ని తెలుసు?

సో... అర్థమయింది కదా... ఫెస్టివల్ సీజన్ రాబోతోంది. ఆఫర్ల మాయలో పడి పర్సు ఖాళీ చేసుకోకండి. మీకు నిజంగా ఓ వస్తువు అవసరం ఉంటే తప్ప కొనకండి. ఆఫర్లు ఏం ఉన్నాయో ఊరికే చూద్దామని, ఇ-కామర్స్ సైట్, యాప్ ఓపెన్ చేసినా ఎక్కడో చోట వలలో పడిపోతారు జాగ్రత్త. అవగాహన కోసం ఆఫర్లు చూడాలనుకున్నా... ఎక్కువ సేపు ఇ-కామర్స్ ప్లాట్‌‌ఫామ్‌పై స్పెండ్ చేయకండి. ఒక వస్తువు ధరెంతో కంపెనీ నిర్ణయించడం కాదు... మీరు కొనాలనుకునే వస్తువుపై కాస్త అధ్యయనం చేసి... దానికి మీరే ఓ విలువ కట్టండి. మీరు అనుకున్న ధరకే వస్తువు వస్తే కొనండి. అంతే తప్ప డిస్కౌంట్లను నమ్మకండి. ఒక్క ఇ-కామర్స్ సైట్లకే కాదు... బయట సూపర్ మార్కెట్లు, బడబడా షాపింగ్ మాల్స్‌లోనూ ఇవే నియమాలు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి:

ISRO గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు... బడ్జెట్ ఎంతో తెలుసా?

ఈ యూజర్లు ఇక IRCTC ఉపయోగించుకోలేరు... ఎందుకో తెలుసా?
First published: January 21, 2019, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading