ఆ విషయంలో ప్రభుత్వానికి సహకరించిన వాట్సాప్...

ప్రముఖ మొబైల్ అప్లికేషన్ వాట్సప్, సిగ్నల్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలు ప్రభుత్వ వ్యవస్థలకు సహకరించడం లేదని ప్రభుత్వ అధికారులు రాజ్యసభ ప్యానెల్‌కు తెలియజేశారు.

news18-telugu
Updated: December 22, 2019, 8:15 PM IST
ఆ విషయంలో ప్రభుత్వానికి సహకరించిన వాట్సాప్...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రముఖ మొబైల్ అప్లికేషన్ వాట్సప్, సిగ్నల్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలు ప్రభుత్వ వ్యవస్థలకు సహకరించడం లేదని ప్రభుత్వ అధికారులు రాజ్యసభ ప్యానెల్‌కు తెలియజేశారు. ‘సోషల్ మీడియాలో నీలిచిత్రాలు, పిల్లల మీద దాని ప్రభావం’ అనే అంశంపై రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల ఓ అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో 10 పార్టీలకు చెందిన 14 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ సభ్యులు ఇప్పటికే పలు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్స్ - సమాచార మంత్రిత్వ శాఖ, ట్రాయ్, పలు సోషల్ మీడియా సంస్థలతో సమావేశం అయ్యారు. పోర్నోగ్రఫీని అరికట్టడంలో సోషల్ మీడియా సంస్థలను కట్టడి చేయడానికి పలు న్యాయపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని ఎలక్ట్రానిక్స్ - సమాచార మంత్రిత్వ శాఖ ఆ ప్యానెల్‌కు తెలియజేసింది. ఆయా సోషల్ మీడియా సంస్థలకు చెందిన సర్వర్లు విదేశాల్లో ఉన్నాయని, వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే ఆ దేశ చట్టాలు అడ్డుపడుతున్నాయని తెలిపింది.

‘వాట్సప్, సిగ్నల్ లాంటి కొన్ని సోషల్ మీడియా సంస్థలు.. సమాచార గోప్యత, వ్యక్తిగత సీక్రెట్ పేరుతో సమాచారాన్ని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. చట్టపరంగా నిర్వహించాల్సిన బాధ్యతలను కూడా వారు గౌరవించడం లేదు.’ అని ఎలక్ట్రానిక్స్ - సమాచార మంత్రిత్వ శాఖ ఆ ప్యానెల్‌కు తెలియజేసింది. కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ నేతృత్వంలోని ఆ ప్యానెల్ వచ్చే నెలలో తమ నివేదికను సమర్పించనుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 22, 2019, 8:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading