ఆన్‌లైన్ యాప్స్‌తో పేమెంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా.. అయితే జాగ్రత్త..

ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్యకాలంలో చాలామంది మనీ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఆన్‌లైన్ యాప్స్‌ని వాడుతున్నారు.. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇలాంటి ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా త్వరగా పనిఅయిపోతుంది. అందుకని చిన్నమొత్తం నుంచి పెద్ద మొత్తం వరకూ వాటి ద్వారే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే, ఇందులో రిస్క్ కూడా ఉంటుంది.. అవేంటంటే..

  • Share this:
    ఫ్రెండ్స్‌కి మనీ పంపాలన్నా.. కరెంట్ బిల్, కేబుల్ బిల్, ఫోన్, వాటర్ బిల్స్ ఇలాంటి వాటికన్నింటికీ మనీ చెల్లించే విషయంలో ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఆన్‌లైన్ యాప్స్ ద్వారా లావాదేవీలు నడిపిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పేలు వాడుతున్నారు. అయితే.. ఇవి అన్నీ సందర్భాల్లో సరైన ఫలితాలను చూపించడం లేదు. కొన్నిసార్లు మనీ సెండ్ చేశాక సక్సెస్ అంటూ మేసేజ్ వస్తోంది. కానీ, అవతలివారికి చేరడం లేదు. దీంతో.. సమస్య మొదలవుతుంది.

    ఈ మధ్యకాలంలో ఇలా ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా లావాదేవీల్లో అవకతవకలు చాలానే జరిగాయి. మనీ పంపేటప్పుడు పంపించే వ్యక్తికి మనీ సెండింగ్ సక్సెస్ అంటూ మేసేజ్ కూడా వస్తుంది. కానీ, టెక్నికల్, ఇతర కారణాల వల్ల ఆ మనీ అవతలివారికి చేరడం లేదు. ఇదే విషయమై బ్యాంక్ అధికారులని సంప్రదిస్తే.. రెండు రోజులు టైమ్ పడుతుందని చెబుతున్నారు. వారం రోజు అనంతరం.. డబ్బులు తిరిగి వస్తాయని ఒకసారి, పేమెంటి జరిగిపోయిందని మరోసారి సమాధానాలు వస్తున్నాయంటూ బాధితులు చెబుతున్నారు. దీంతో.. రోజూ బ్యాంకుల చుట్టూ తిరగలేక డబ్బుని వదిలేసుకుంటున్నారు చాలామంది. ఇవి కొన్ని ఉదహారణలు మాత్రమే..

    అయితే, అన్నిసార్లు ఇలానే జరగదు.. ఎంతో సౌలభ్యంగా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. అందువల్లే చాలామంది వీటికి అలవాటు పడ్డారు. ఫోన్‌ నుంచి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసుకుంటున్నారు. ఈ విషయంలో బ్యాంక్ అధికారులను కూడా తప్పు పట్టలేం... వారిని సంప్రదించినప్పుడు..‘మా చేతుల్లో ఉన్నంతవరకు చేస్తున్నాం.. కొన్ని అంశాలు ఆయా యాప్ సంస్థల కార్యాలయాలతో ముడిపడి ఉంటాయి’ అనే సమధానం ఎదురవుతోంది. కాబట్టి... ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తత పడడం మంచిది. చిన్న నగదు అయితే.. అంతగా బాధఉండకపోవచ్చు.. కానీ వేలల్లో అంటే.. ఖచ్చితంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది.. వీలైనంతంగా ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పేమెంట్స్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
    First published: