Zomato: సంచలనం సృష్టించిన జొమాటో.. డ్రోన్లతో ఫుడ్ డెలివరీ

Zomato: కేవలం 10 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణించగల హైబ్రిడ్‌ డ్రోన్‌ ద్వారా బుధవారం పరీక్ష నిర్వహించినట్లు జొమాటో తెలిపింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 13, 2019, 3:40 PM IST
Zomato: సంచలనం సృష్టించిన జొమాటో.. డ్రోన్లతో ఫుడ్ డెలివరీ
జొమాటో డ్రోన్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 13, 2019, 3:40 PM IST
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో.. సరికొత్త రికార్డు సృష్టించింది. డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. కేవలం 10 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణించగల హైబ్రిడ్‌ డ్రోన్‌ ద్వారా బుధవారం పరీక్ష నిర్వహించినట్లు జొమాటో తెలిపింది. ఈ డ్రోన్‌ గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో, 5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని మోసుకెళ్లగలదని కంపెనీ వెల్లడించింది. పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ పరిధిలోని ఒక నియంత్రణ ప్రాంతంలో ఈ పరీక్షను నిర్వహించింది. రోడ్డు మార్గం కన్నా ఆకాశ మార్గాన ఆహార పదార్థాలను మరింత వేగవంతంగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన సర్వీసులకు శ్రీకారం చుట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. దీనికి టెక్నాలజీ అంత సిద్ధంగా ఉన్నప్పటికీ నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుందన్నారు.

డ్రోన్లలో నిక్షిప్తం చేసిన సెన్సర్‌కు కంప్యూటర్ సెన్సర్‌తో అనుసంధానం చేయడం ద్వారా డెలివరీ చేసే ప్రాంతాన్ని ముందుగా గుర్తించి డెలివరీ చేయవచ్చని తెలిపారు. కాగా, గత డిసెంబరులో జొమాటో.. డ్రోన్ సేవలు అందించేందుకు లక్‌నవూకు చెందిన స్టార్టప్‌ టెక్‌ఈగల్‌ను కొనుగోలు చేసింది.

First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...