ONLINE CARD PAYMENT METHOD WILL CHANGE JANUARY 2022 RBI INTRODUCING TOKENIZATION METHOD EVK
RBI : ఆర్బీఐ కొత్త రూల్స్.. ఆన్లైన్ లావాదేవీలు మరింత సులభం
(ప్రతీకాత్మక చిత్రం)
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగదారులకు శుభవార్త. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల (Online Transactions) లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ జనవరి 2022 నుంచి టోకెనైజేషన్‌పై కొత్త నిర్ణయాలు తీసుకుంది.
ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీలు మన జీవితంలో భాగంగా మారాయి. ఇప్పటికే చాలా పేమెంట్స్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం. భవిష్యత్‌లో మరింతగా ఈ లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అదే టోకెనైజేషన్ పద్ధతి. ఇక జనవరి 2022 నుంచి ఆన్లైన్ లావాదేవీ (Online Transactions) ల్లో పెద్ద మార్పులు వస్తాయి. ఈ విధానం వల్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు (Debit Card) ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు మరింత సురక్షితం కానున్నాయని ఆర్బీఐ (RBI) చెబుతోంది. మనం ఈ కామర్స్ యాప్‌లు, వెబ్సైట్లో ఏమైన కొనాలంటే కార్డ్ డీటెయిల్స్ (Card Details) తో పాటు వ్యక్తిగత వివరాల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినవి సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మన సమాచారం ఇతరుల బారిన పడకుండా ఉండేందుకు కార్డు వివరాలు కాకుండా టోకెన్ కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయం క్యూఆర్ కోడ్ (QR code) చెల్లింపులతో పాటు పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ (రిటైల్ స్టోర్లలో కార్డ్ లావాదేవీలను నిర్వహించడానికి ఉపయోగించే హార్డ్‌వేర్) లావాదేవీలను నిర్వహించడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.
ఏమిటీ ఈ కొత్త విధానం..
సెన్సిటివ్ డేటాను నాన్-సెన్సిటివ్ డేటా (Sensitive DATA) గా మార్చే ప్రక్రియను టోకెన్స్ (Tokens) అంటారు. యూజర్ల క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల 16 అంకెల డిజిటల్ అకౌంట్‌ను.. డిజిటల్ క్రెడెన్షియల్గా టోకెన్ మార్చేస్తుంది. దీ
ని ద్వారా కస్టమర్ల కార్డు (Customers) డేటా మర్చంట్ పేమెంట్ సిస్టమ్‌లో సేవ్ అయి, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీని ద్వారా కస్టమర్ల డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ టోకెనైజేషన్‌పై కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఒకవేళ వినియోగదారుడు కార్డు డేటా సేవ్ చేసుకోవాలనుకుంటే.. ఎడిషన్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పకుండా ఉండాలని వెల్లడించింది.
ఎలా పని చేస్తుంది..
ఆన్లైన్ లావాదేవీలు (Online Transactions) నిర్వహిస్తున్నప్పుడు మన కార్డ్ వివరాలు ఎంటర్ చేస్తాం.. అప్పడు ఇవి టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించే కార్డు నెట్వర్క్ కంపెనీలైన వీసా, మాస్టర్ కార్డులకు అనుమతికోసం రిక్వెస్ట్ (Request) పంపిస్తాయి. ఇవి కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో చెక్ చేసుకొని టోకెన్ నెంబర్లను జనరేట్ చేస్తాయి. ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.తర్వాత ఎప్పుడైనా లావాదేవీలు నిర్వహిస్తే..కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు (CVV Numbers) ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది. ఈ ప్రక్రియ లావాదేవీ ప్రారంభించిన ప్రతిసారి యూజర్ల డేటాను షేర్ చేసే అవసరం ఉండదు. ఆన్లైన్ చెల్లింపులు స్పీడుగా చేసుకోవచ్చు. టోకెన్‌తో కార్డ్ నంబర్, సీవీవీ వివరాల్ని షేర్ చేసే అవసరం ఉండదు.
ఆర్బీఐ త్వరలో అందుబాటులోకి రానున్న ఈ టోకనైజేషన్ (Tokenization) వ్యవస్థ సులభతరంగా ఉంది. అయితే ఈ విధానం అమలు, భద్రత ఎంతవరకు సరిగా ఉంటుంది అనేది పూర్తిగా అమల్లోకి వచ్చాక తెలుస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.