హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus: అమెజాన్​లో వన్​ప్లస్​ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు​.. ఏకంగా రూ.13వేల వరకు డిస్కౌంట్​

OnePlus: అమెజాన్​లో వన్​ప్లస్​ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు​.. ఏకంగా రూ.13వేల వరకు డిస్కౌంట్​

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

OnePlus: భారత మిడ్​రేంజ్​, ప్రీమియం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో దూసుకుపోతుంది వన్​ప్లస్. ఈ బ్రాండ్​ నుంచి విడుదలయ్యే ఫోన్లకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఏర్పడింది. దీంతో ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్​ ఈ ఫోన్లపై ఆఫర్ల వర్షం కురిపించింది.

ఇంకా చదవండి ...

భారత మిడ్​రేంజ్​, ప్రీమియం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో దూసుకుపోతుంది వన్​ప్లస్ (One Plus). ఈ బ్రాండ్​ నుంచి విడుదలయ్యే ఫోన్లకు మార్కెట్ (Market) ​లో మంచి డిమాండ్​ ఏర్పడింది. దీంతో ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ (Amazon)​ ఈ ఫోన్లపై ఆఫర్ల వర్షం కురిపించింది. వన్​ప్లస్​ 9 ప్రో, వన్​ప్లస్​ 9, వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 5జీ ఫోన్లపై ఏకంగా రూ. 8 వేల డిస్కౌంట్​ అందిస్తోంది. అంతేకాదు, ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)​ క్రెడిట్ (Credit Card)​ లేదా డెబిట్​ కార్డును ఉపయోగించి వీటిని కొనుగోలు చేస్తే అదనంగా 1,500 తక్షణ లభిస్తుంది. ఈ డీల్స్​ అన్నీ ఈ–కామర్స్ (E-Commerce)​ దిగ్గజం అమెజాన్​తో పాటు OnePlus.in లో కూడా అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 31 వరకు ఆఫర్లను పొందవచ్చని అమెజాన్ స్పష్టం చేసింది.

వన్​ప్లస్​ 9 ప్రో డీల్

ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ సహాయంతో వన్​ప్లస్​ 9 ప్రో (One Plus Pro) ఫోన్​ కొనుగోలు చేస్తే 5,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ లావాదేవీలపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ డీల్ అమెజాన్​తో పాటు వన్​ప్లస్​ డాట్​ ఇన్​ వెబ్​సైట్​లో కూడా అందుబాటులో ఉంటుంది. పేమెంట్​ చెక్​అవుట్ దగ్గర కూపన్​ కోడ్​ అప్లై చేస్తే మరో రూ. 5,000 తగ్గింపు లభిస్తుంది.

WhatsApp: భారత్​లో 20 లక్షలకు పైగా వాట్సాప్​ అకౌంట్లపై నిషేధం.. కారణం ఏంటో తెలుసా?


ఈ రెండు ఆఫర్లను ఉపయోగించుకుంటే వన్​ప్లస్​ 9 ప్రోపై ఏకంగా రూ.10 వేల తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్​లో వన్​ ప్లస్​ 9 ప్రో 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ ప్రారంభ వేరియంట్​ రూ. 64,999 ధర వద్ద, 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ మోడల్‌ రూ. 69,999 వద్ద లభిస్తున్నాయి. ఇవి మార్నింగ్ మిస్ట్, పైన్ గ్రీన్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.

వన్​ప్లస్​ 9 డీల్

వన్​ప్లస్​ 9 స్మార్ట్​ఫోన్​ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ. 8,000 ఇన్​స్టన్ట్ డిస్కౌంట్​ లభిస్తుంది. ఈ ఆఫర్​ ఈఎంఐ లావాదేవీలపై కూడా వర్తిస్తుంది. మొత్తం తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్​తో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ అమెజాన్​తో పాటు OnePlus.in లో అందుబాటులో ఉంటుంది. పేమెంట్​ చెక్అవుట్ వద్ద కూపన్ కోడ్ అప్లై చేస్తే రూ. 5000 తగ్గింపు లభిస్తుంది.

Instagram Features: మీరు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారా? అయితే ఈ ఫీచ‌ర్స్ తెలుసుకోండి.


ఈ రెండు ఆఫర్లను ఉపయోగించుకుంటే.. వన్​ప్లస్​ 9పై ఏకంగా రూ. 13 వేల డిస్కౌంట్​ పొందవచ్చు. ఇక, 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ గల వన్​ప్లస్ 9 ప్రారంభ వేరియంట్ రూ. 49,999 వద్ద, 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 54,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఇవి ఆర్కిటిక్ స్కై, ఆస్ట్రల్ బ్లాక్, వింటర్ మిస్ట్ కలర్​ ఆప్షన్లలో లభిస్తాయి.

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 5జీ డీల్

అమెజాన్​ వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 5జీపై కూడా భారీ ఆఫర్​ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,500 తక్షణ డిస్కౌంట్​ అందిస్తోంది. మూడు నెలల నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం కల్పిస్తోంది. ఈ డీల్ OnePlus.in, అమెజాన్​లో అందుబాటులో ఉంటుంది. వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 5జీ 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ మోడల్​ రూ. 22,999, 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ మోడల్‌ రూ. 24,999, 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ మోడల్​ రూ. 27,999 వద్ద అందుబాటులో ఉంటాయి.

Published by:Sharath Chandra
First published:

Tags: Android, Latest Technology, Oneplus, Smartphone

ఉత్తమ కథలు