చైనీస్ ఎలక్ట్రానిక్ కంపెనీ వన్‌ప్లస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న వన్‌ప్లస్ 11ను భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. ప్రీమియం రేంజ్‌లో వస్తున్న ఈ హ్యాండ్ సెట్ చైనాలో జనవరిలోనే లాంచ్ కావచ్చు. వన్‌ప్లస్ 11 5జీకి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్‌పై కొన్ని లీక్స్ ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టిప్‌స్టర్ డీటైల్స్
టిప్‌స్టర్‌కు చెందిన యోగేష్ బ్రార్ వన్‌ప్లస్ 11 సంబంధించిన వివరాలను వెల్లడించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది లాంచ్ కానున్న మరో డివైజ్ వన్‌ప్లస్ 11R అంచనా ధర వివరాలను సైతం వెల్లడించారు. ఈ రెండు 5జీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను గత నెల నుంచి భారత్‌లో టెస్ట్ చేస్తున్నట్లు బ్రార్ తెలిపారు. ఈ రెండు డివైజ్‌లు దాదాపు ఒకే డిజైన్‌తో విభిన్న మెటిరియల్స్, కెమెరా ఆప్షన్‌లతో రానున్నాయి. ఈ రెండిటిలో OnePlus 11R అనేది తక్కువ ధరకు అందుబాటులోకి రావచ్చు.
వన్‌ప్లస్ 11 ధర
వన్‌ప్లస్ 11 ధర రూ.55,000 నుంచి రూ.65,000 మధ్య ఉండవచ్చని టిప్‌స్టర్ అంచనా వేసింది. భారత్‌లో ఇప్పటికే లాంచ్ అయిన వన్‌ప్లస్ 10 ప్రో ధర కంటే ఇది మరింత తక్కువ. కాగా, వన్‌ప్లస్ 10 ప్రో రూ.66,999తో లాంచ్ అయింది.
స్పెసిఫికేషన్స్
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లేతో రావచ్చు. 32MP ఫ్రంట్ కెమెరాకు హోల్-పంచ్ కటౌట్ ఉంటుంది. స్క్రీన్ ఇరువైపులా కర్వ్డ్‌గా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50MP సోనీ IMX890 మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 32MP టెలిఫోటో సెన్సార్ ఉండే అవకాశం ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే, beefy 5000mAh బ్యాటరీ ఉండవచ్చు. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్‌తో రావచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 13-ఆధారిత ఆక్సిజన్ OS 13పై రన్ అవుతుంది.
వన్‌ప్లస్ 11R ధర
ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus 10T 5Gను రీప్లేస్ చేయనుంది. అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే ఫోన్ ధర సుమారు రూ.3,000– రూ.5,000 ఎక్కువగా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేసింది. దీంతో భారత్‌లో లాంచ్ కానున్న OnePlus 11R ధర రూ.50,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొంది.
స్పెసిఫికేషన్స్
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లేతో లాంచ్ కావచ్చు. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్ ఇందులో వినియోగించే అవకాశం ఉంది. ఈ హ్యాండ్ సెట్‌లో 100W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీ ఉండవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఇందులో 50MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP షూటర్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 16MP షూటర్ ఉండవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Oneplus, Technology