వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లే కాదు టీవీలకు కూడా భారత్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది. తాజాగా భారత్ లో ఈ వన్ ప్లస్ టీవీల ధరను కాస్త పెంచిందీ సంస్థ. బీబీకే ఎలక్ట్రానిక్స్ అధీనంలో ఉన్న ఈ కంపెనీ U1S, Y1 సిరీస్ టీవీలను ఖరీదును పెంచింది. మొత్తంగా ఆరు మోడళ్ల ధరలను పునరుద్ధరించింది. ఈ ధరల పెరుగుదల ఒకే విధంగా లేదు. Y1 సిరీస్ ధర పెరుగుదలలో పెద్ద మార్పు లేనప్పటికీ యూ1ఎస్ సిరీస్ అతి చిన్న వేరియంట్ ధరను మాత్రం ఎక్కువగా పెంచింది. ధర పెరిగిన తర్వాత సంబంధిత మోడళ్ల నూతన ధరలన్నీ వన్ ప్లస్ ఇండియా వెబ్ సైట్ లో ప్రతిబింభిస్తాయి. ఇవి అమెజాన్ లో కూడా వర్తిస్తాయి. వన్ ప్లస్ టీవీ వై1 సిరీస్, వన్ ప్లస్ వై1 సిరీస్ నూతన ధరలను పెరుగుదల ఇప్పుడు చూద్దాం. BMW CE 04 Electric Scooter: బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరే ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్.. ఫొటోలివే.. Soundmojis: ఎమోజీల్లో సౌండ్ ఫీచర్.. ప్రారంభించిన ఫేస్ బుక్.. వివరాలివే
- వన్ ప్లస్ టీవీ32వై1 పాత ధర రూ.16,999లు కాగా.. తాజాగా 2 వేలు పెంచి రూ.18,999లుగా నిర్ణయించింది.
- వన్ ప్లస్ టీవీ40వై1 పాత ధర రూ.23,999లు కాగా.. రూ.2,500 పెంచి రూ.26,4999లుగా నిర్దేశించింది.
- వన్ ప్లస్ టీవీ43వై1 పాత ధర రూ.26,399లు కాగా.. రూ.2500 పెంచి నూతన ధరను రూ.29,499లుగా నిర్ణయించింది.
- వన్ ప్లస్ టీవీ 55యూ1ఎస్ పాత ధర రూ.47,999లు కాగా.. తాజాగా 5000 పెంచి నూతన ధరను రూ.52,999లుగానిర్దేశించింది.
- వన్ ప్లస్ టీవీ 65యూ1ఎస్ పాత ధర రూ.62,999లు కాగా.. ప్రస్తుతం రూ.6000 పెంచిన నూతన ధరను రూ.68,999లుగా నిర్ణయించింది.
వన్ ప్లస్ టీవీ వై1 సిరీస్ స్పెసిఫికేషన్లు..
ఈ ఫీచర్లు వన్ ప్లస్ వై1 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. అంతేకాకుండా డాల్బీ ఆడియో ఇందులో సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9.0తో నడుస్తుంది. 43, 40 అంగుళాల మోడళ్ల రిజల్యూషన్ 1920X1080pను కలిగి ఉంది. అయితే 32-అంగుళాల మోడల్ కు ఇది 1366X768p రిజల్యూషన్ తో పాటు ఇంజిన్ పిక్చర్ ఎనహాన్సర్ క్రోమ్ కాస్ట్ లో నిర్మించారు. వన్ ప్లస్ టీవీ యూ1ఎస్ సిరీస్ స్పెక్ ఈ రేంజ్ లో మోడళ్లు 4కే రిజల్యూషన్ ను సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా HDR10 ప్లస్ సర్టిఫైడ్ డిస్ ప్లేను కలిగి ఉండి ఆండ్రాయిడ్ టీవీ10, 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.