హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus TV: ఇండియాలో వన్‌ప్లస్ టీవీ 43 Y1S ప్రో సేల్ ప్రారంభం.. స్మార్ట్ టీవీ ధర, ఆఫర్ల వివరాలు

OnePlus TV: ఇండియాలో వన్‌ప్లస్ టీవీ 43 Y1S ప్రో సేల్ ప్రారంభం.. స్మార్ట్ టీవీ ధర, ఆఫర్ల వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వన్‌ప్లస్ టీవీ 43 Y1S ప్రో 4K (OnePlus TV 43 Y1S Pro 4K) స్మార్ట్ టీవీని కొన్ని రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్ సేల్స్ నేటి నుంచి (ఏప్రిల్ 11 నుంచి) ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.

స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) కొత్తగా స్మార్ట్ టీవీల తయారీపై దృష్టి పెట్టింది. ఈ సంస్థ వన్‌ప్లస్ టీవీ 43 Y1S ప్రో 4K (OnePlus TV 43 Y1S Pro 4K) స్మార్ట్ టీవీని కొన్ని రోజుల క్రితం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్ సేల్స్ నేటి నుంచి (ఏప్రిల్ 11 నుంచి) ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త OnePlus TV.. ఆక్సిజన్ UI, Android TV ప్లాట్‌ఫారమ్‌పై పనిచేసే సరసమైన 4K స్మార్ట్ టీవీ కావడం విశేషం. వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ కొత్త స్మార్ట్ టీవీ ధర, ఫీచర్లు, సేల్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* వన్‌ప్లస్ TV 43 Y1S ప్రో ధర, సేల్ ఆఫర్లు

భారతదేశంలో OnePlus TV 43 Y1S ప్రో ప్రారంభ ధర రూ. 29,999. ఇది మీరు దేశంలో కొనుగోలు చేయగల అత్యంత సరసమైన 4K స్మార్ట్ టీవీలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ టీవీని కొనుగోలు చేసే వారి కోసం OnePlus స్పెషల్ సేల్ డే ఆఫర్‌లను పొందింది. ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ ఉపయోగించి టీవీని కొనుగోలు చేస్తే.. కంపెనీ రూ.2,500 స్పెషల్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో దేశంలో OnePlus TV 43 Y1S ప్రో ధర రూ. 27,499కి తగ్గుతుంది. కొనుగోలుదారులు OnePlus TV 43 Y1S ప్రో మోడల్‌ను అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్‌లపై 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆఫర్‌తో పొందే అవకాశం ఉంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌తో ఎంపిక చేసిన కొనుగోలుదారులకు వన్‌ప్లస్ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.

Refurbished Phones: రీఫర్బిష్డ్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఆ మోడళ్లపై ఏకంగా 76 శాతం డిస్కౌంట్..


* స్పెసిఫికేషన్లు

OnePlus TV 43 Y1S ప్రో 43 అంగుళాల 4K డిస్‌ప్లేతో వస్తుంది. ఇమేజ్ క్వాలిటీని మెరుగుపరిచే గామా ఇంజిన్‌ ఇందులో ఉంటుంది. దీని డిస్ప్లే HDR10+, HDR10, HLG కోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. టీవీ బెజెల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. ప్రీమియం లుక్‌తో ఈ డివైజ్ అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. డాల్బీ ఆడియో-సపోర్ట్ అవుట్‌పుట్‌ను అందించే డ్యుయల్ 24W సౌండ్ స్పీకర్‌లను కంపెనీ ఈ టీవీలో అమర్చింది.

Moto G22: రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటో జీ22 రిలీజ్... ఫీచర్స్ ఇవే

OnePlus TV 32 Y1S Pro ఆక్సిజన్‌OS UI, Android TV 10 ప్లాట్‌ఫారమ్‌తో పనిచేస్తుంది. OnePlus స్మార్ట్‌ఫోన్ లేదా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ యూజర్లు టీవీతో కొత్త యూజర్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. భారతదేశంలో సరసమైన ధరలో లభిస్తున్న ఈ 4K TV కోసం కస్టమర్లు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సేల్ డేట్‌ను కంపెనీ తాజాగా వెల్లడించింది.

First published:

Tags: 5g technology, Budget smart tv, Technology

ఉత్తమ కథలు