చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్బ్రాండ్ వన్‌ప్లస్ కేవలం స్మార్ట్‌ఫోన్ (Smartphone) మార్కెట్లోనే కాదు స్మార్ట్‌టీవీ మార్కెట్లోనూ దూసుకుపోతోంది. వన్‌ప్లస్ (One Plus) తాజాగా 55 అంగుళాల Y1S ప్రో 4K టీవీని విడుదల చేసింది. ఈ సరికొత్త స్మార్ట్‌టీవీ ప్రస్తుతం ఉన్న 43 -అంగుళాల, 50 అంగుళాల డిస్ప్లే మోడళ్లతో పాటు లభించనుంది. ఇది 230+ లైవ్ ఛానెల్‌లు, 24 వాట్ ఆడియో అవుట్‌పుట్ యాక్సెస్‌తో పాటు వన్‌ప్లస్ 2.0, ఆక్సిజన్ ప్లే 2.0 వంటి అదిరిపోయే ఫీచర్లతో వస్తుంది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ టీవీ 55 Y1S ప్రో స్మార్ట్ టీవీ రూ. 39,999 ధర వద్ద విడుదలైంది. దీని అమ్మకాలు డిసెంబర్ 13 మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌టీవీని వన్‌ప్లస్.ఇన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు వన్‌ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టోర్లు, వన్‌ప్లస్ రిటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. కాగా, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసే వారు ప్రారంభపు ఆఫర్లో భాగంగా రూ. 3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌టీవీ కొనుగోలుపై తొమ్మిది నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు.
ఫీచర్లు
వన్‌ప్లస్ టీవీ 55 Y1S ప్రో స్మార్ట్ టీవీ 55 -అంగుళాల 4K UHD LED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే బెజిల్ లెస్ డిజైన్‌తో వస్తుంది. HDR10+ డీకోడింగ్, HDR10, HLG ఫార్మాట్ వంటి డిస్ప్లే ఫీచర్లను కలిగి ఉంటుంది. మరోవైపు, ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM),MEMC లకు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ 24 వాట్ల ఆడియో అవుట్‌పుట్‌ను అందించగలదు. దీనిలో డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌ను కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 10 ఆక్సిజన్‌ప్లే 2.0, గూగుల్ అసిస్టెంట్ బిల్ట్ ఇన్‌పై రన్ అవుతుంది.
ఇది అమెజాన్ అలెక్సా డివైజ్‌తో కూడా దీన్ని ఆపరేట్ చేయవచ్చు. దీనిలో 64 -బిట్ మీడియాటెక్ MT9216 ప్రాసెసర్‌ను అమర్చింది. ఇది 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ 3x HDMI ARC సపోర్ట్, 2x USB, ఆప్టికల్, ఈథర్నెట్, వైఫై 802.11 ac, 2.4GHz + 5GHz, బ్లూటూత్ 5.0 LE వైర్లెస్ కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 30 లైవ్ ఛానెల్స్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది. ఐ కేర్ మోడ్, కిడ్స్ మోడ్ వంటి విభిన్న మోడ్లలో పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.