ONEPLUS TO LAUNCH ONEPLUS 10R SMART PHONE SOON HERE ARE THE FEATURES AND SPECIALITIES FULL DETAILS HERE PRN GH
OnePlus 10R: త్వరలోనే మార్కెట్లోకి వన్ ప్లస్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్.. రిలీజ్ కు ముందే లీకైన ఫీచర్లు.. మీరూ ఓ లుక్కేయండి..
ప్రతీకాత్మకచిత్రం
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ ప్లస్ (OnePlus)వరుస స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ తో దూకుడుమీదుంది. ఈ ఏడాది మొత్తం 6 స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో వన్ ప్లస్ 9R (OnePlus 9R) కి సక్సెసర్ గా వన్ ప్లస్10R (OnePlus 10R ) ని కూడా ప్రకటించాలని కంపెనీ భావిస్తోంది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus)వరుస స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ తో దూకుడుమీదుంది. ఈ ఏడాది మొత్తం 6 స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో వన్ ప్లస్ 9R (OnePlus 9R) కి సక్సెసర్ గా వన్ ప్లస్ 10R (OnePlus 10R ) ని కూడా ప్రకటించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, దీని లాంచింగ్ డేట్, స్పెసిఫికేషన్లపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. అయితే, రిలీజ్‌కు ముందే వన్ ప్లస్ 10 ఆర్ ఫీచర్లు ఆన్ లైన్లో లీకయ్యాయి. లీకేజీలను బట్టి చూస్తే.. ఈ ఫోన్లోని ఫీచర్లు రియల్మీ జీటీ నియో 3 మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. 91 మొబైల్స్ టిప్ స్టర్ యోగేష్ బ్రార్ వన్ ప్లస్ 10ఆర్ ఫీచర్లను టీజ్ చేశారు. ఆయన ప్రకారం, రాబోయే వన్ ప్లస్10R ఫోన్.. వన్ ప్లస్ 9 ఆర్‌ను మించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, పెద్ద 120Hz డిస్ప్లే, బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.
వన్ ప్లస్ 10ఆర్ లో వన్ ప్లస్ 10 ప్రో మాదిరిగానే HDR 10+ సర్టిఫికేషన్ తో కూడిన 6.7 -అంగుళాల AMOLED E4 డిస్ ప్లేను అందించనుంది. దీని డిస్ప్లేలో ఫ్లాట్ ప్యానెల్ కూడా ఉంటుంది. ఇది ఫుల్ హెచ్.డి ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీని ముందు, వెనుక భాగం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో ప్రొటెక్షన్ తో పాటు స్టీరియో స్పీకర్లను అందించనుంది.
150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ తో
వన్ ప్లస్ 10 ఆర్ స్మార్ట్ ఫోన్ 150W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతిస్తుంది. ఇది మొత్తం రెండు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. వాటిలో ఒక మోడల్ 80W ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరొక మోడల్ 150W ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇదే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని రియల్ మీ జీటీ నియో 3 ఫోన్లోనూ ఉపయోగించారు. అయితే, రియల్ మీ 9R లో ఉపయోగించిన స్నాప్ డ్రాగన్ SoC చిప్ సెట్ కి బదులుగా వన్ ప్లస్ 10Rలో మీడియాటెక్ చిప్ సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, రాబోయే వన్ ప్లస్ 10R మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5G ప్రాసెసర్‌తో వస్తుంది.
ప్రీమియం వన్‌ప్లస్ ఫోన్లలో లభించే అలర్ట్ స్లైడర్‌ను వన్‌ప్లస్ 10Rలోనూ అందించనున్నట్లు ప్రైస్ బాబా నివేదిక పేర్కొంది. కాగా, రియల్ మీ జీటీ నియో 3 ప్రస్తుతం చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది భారతదేశంలోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై స్పష్టత లేదు. తాజాగా, ఈ స్మార్ట్ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్లో కనిపించింది. టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ సూచించినట్లుగా, ఏప్రిల్ లేదా మేలో దీని అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.