Home /News /technology /

ONEPLUS SILENTLY LAUNCHED ONEPLUS NORD N20 SE SMARTPHONE WITH MEDIATEK HELIO G35 PROCESSOR 5000 MAH BATTERY KNOW OTHER SPECIFICATIONS SS

OnePlus Nord 20 SE: రూ.15 వేలకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... సైలెంట్‌గా లాంఛ్ చేసిన కంపెనీ

OnePlus Nord 20 SE: రూ.15 వేలకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... సైలెంట్‌గా లాంఛ్ చేసిన కంపెనీ
(ప్రతీకాత్మక చిత్రం)

OnePlus Nord 20 SE: రూ.15 వేలకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... సైలెంట్‌గా లాంఛ్ చేసిన కంపెనీ (ప్రతీకాత్మక చిత్రం)

OnePlus Nord 20 SE | ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ సైలెంట్‌గా రూ.15 వేలకే మొబైల్ లాంఛ్ చేసింది. ఒప్పో నుంచి రిలీజైన మొబైల్ ఫీచర్స్ లాగానే వన్‌ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ ఫీచర్స్ ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Visakhapatnam | Hyderabad | Tirupati
ఒకప్పుడు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.30,000 కన్నా ఎక్కువ బడ్జెట్ కేటాయించాల్సి వచ్చేది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా వన్‌ప్లస్ పరిచయం అయింది. ఆ తర్వాత వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో (OnePlus Nord Series) కాస్త తక్కువ బడ్జెట్‌లో మొబైల్స్‌ని రిలీజ్ చేస్తోంది. వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ 2టీ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లాంటి మొబైల్స్ అన్నీ రూ.30,000 లోపు బడ్జెట్‌లోనే వచ్చాయి. ఇక ఇటీవల వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ (OnePlus Nord CE 2 Lite) మొబైల్ లాంఛ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ చేయడం విశేషం. ఇంత తక్కువ ధరలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయడం ఇదే తొలిసారి.

ఇప్పుడు వన్‌ప్లస్ మరో సంచలనం సృష్టించించింది. రెండు రోజుల క్రితం వన్‌ప్లస్ 10టీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన కంపెనీ సైలెంట్‌గా వన్‌ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ (OnePlus Nord 20 SE) మోడల్‌ను రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన చీపెస్ట్ మొబైల్ ఇదే. ప్రారంభ ధర సుమారు రూ.15,800 ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంఛ్ అయింది. అక్కడ సేల్ కూడా ప్రారంభం అయింది. ఇండియాలో రిలీజ్ అవుతుందా లేదా అన్న స్పష్టత లేదు.

Mobile Offer: అమెజాన్‌లో ఆ ఆఫర్ మళ్లీ వచ్చింది... ఫ్లాగ్‌షిప్ మొబైల్‌పై భారీ డిస్కౌంట్

వన్‌ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే కేవలం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే రిలీజైంది. మెమొరీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌తో 4జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ పోకో సీ31, ఒప్పో ఏ55 లాంటి మొబైల్స్‌లో కూడా ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ మొబైల్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సెలెస్టియల్ బ్లాక్, బ్లూ ఒయాసిస్ కలర్స్‌లో రిలీజైంది.

Nokia Phone: నోకియా నుంచి కొత్త ఫోన్... ధర 3,999 మాత్రమే... ఫీచర్స్ ఇవే



వన్‌ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ ఫీచర్స్ చూస్తే ఇండియాలో లేటెస్ట్‌గా రిలీజైన ఒప్పో ఏ77 స్మార్ట్‌ఫోన్‌లా ఉన్నాయి. ఒప్పో ఏ77 రీబ్రాండ్ చేసి వన్‌ప్లస్ నార్డ్ 20 ఎస్ఈ రిలీజ్ చేసి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు