హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus RT: వచ్చే నెలలో వన్​ప్లస్ ఆర్​టీ స్మార్ట్​ఫోన్​, బడ్స్​ జెడ్​2 లాంచ్​.. లీకైన ఫీచర్ల వివరాలివే..!

OnePlus RT: వచ్చే నెలలో వన్​ప్లస్ ఆర్​టీ స్మార్ట్​ఫోన్​, బడ్స్​ జెడ్​2 లాంచ్​.. లీకైన ఫీచర్ల వివరాలివే..!

7. వన్​ప్లస్​ బడ్స్ Z2 బ్లూటూత్ v5.2 కనెక్టివిటీతో వస్తుంది. మెరుగైన ఆడియో ఎక్స్​పీరియన్స్​ కోసం యాక్టివ్​ నాయిస్​ క్యాన్సిలేషన్ సపోర్ట్​ను అందించనుంది. ఈ బడ్స్​ 40dB వరకు నాయిస్‌ను తగ్గించగలవు. ఏఎన్​సీ మూడు మైక్రోఫోన్లు, వాయిస్ కాలింగ్ సపోర్ట్​తో వస్తుంది. వన్​ప్లస్​ బడ్స్​ Z2 టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్​ IP55 -సర్టిఫికేషన్​తో వస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌ 40mAh బ్యాటరీతో వస్తాయి. వీటిని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్‌ చేస్తే 38 గంటల బ్యాటరీ లైఫ్​ను అందించగలవని వన్​ప్లస్​ పేర్కొంది. ఇది ఏడు గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

వన్​ప్లస్​ ఆర్​టీ డివైజ్ వన్‌ప్లస్ 9RT రీబ్రాండ్​గా విడుదల కానుంది. ఇది హ్యాకర్ బ్లాక్, నానో సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. మరోవైపు వన్​ప్లస్​ బడ్స్ Z2 అబ్సిడియన్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది.

ఇంకా చదవండి ...

భారత్​లో వన్​ప్లస్​(OnePlus) ఉత్పత్తులకు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ బ్రాండ్​(Brand) ఇటీవల వరుసగా స్మార్ట్​ ఉత్పత్తులు (Smart Products) విడుదలవుతున్నాయి. ఇదే స్పీడ్​లో వచ్చే నెలలో వన్​ప్లస్​ ఆర్​టీ, వన్​ప్లస్​ బడ్స్​ జెడ్​2 ఇయర్​బడ్స్​ (Ear buds) ను లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండూ ఇప్పటికే అక్టోబర్‌ నెలలో చైనా మార్కెట్​లోకి విడుదలయ్యాయి. అక్కడ వీటికి మంచి రెస్నాన్స్ వచ్చింది. దీంతో త్వరలో భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు వన్​ప్లస్​ సిద్ధమవుతోంది. వన్​ప్లస్​ ఆర్​టీలోని ఫీచర్లు గత నెలలో చైనాలో లాంచ్ అయిన వన్​ప్లస్​ 9RT వలే ఉండనున్నాయి. ఈ వన్​ప్లస్​ బడ్స్​ జెడ్​2 ఇయర్​బడ్స్​ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్​తో వస్తాయి.

OnePlus 10 Pro: రిలీజ్​కు ముందే లీకైన వన్​ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు... కొత్త డిజైన్​, కళ్లు చెదిరే ఫీచర్లు

టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ పేర్కొన్న వివరాల ప్రకారం, వన్​ప్లస్​ ఆర్​టీ డివైజ్ వన్‌ప్లస్ 9RT రీబ్రాండ్​గా విడుదల కానుంది. ఇది హ్యాకర్ బ్లాక్, నానో సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. మరోవైపు వన్​ప్లస్​ బడ్స్ Z2 అబ్సిడియన్ బ్లాక్, పెరల్ వైట్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రానుంది. ఇవి అమెజాన్​ వెబ్​సైట్ ద్వారా అమ్మకానికి రానున్నాయి. అయితే వీటి కచ్చితమైన లాంచింగ్​ తేదీపై మాత్రం స్పష్టతలేదు.

వన్​ప్లస్​ ఆర్​టీ స్పెసిఫికేషన్లు (అంచనా)

వన్​ప్లస్​ ఆర్​టీ గత నివేదికలలో సూచించిన విధంగా దీనిలోని ఫీచర్లు వన్​ప్లస్​ 9RTతో సమానంగా ఉంటాయి. ఈ స్మార్ట్​ఫోన్​ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.62 -అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో గరిష్టంగా 12 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజ్​ను అందించనుంది. ఇది స్నాప్​డ్రాగన్​ 888 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. వన్​ప్లస్ ఆర్​టీ50 -మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 16 -మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 -మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. దీని ముందు భాగంలో 16 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చనుంది. ఇక, ఈ స్మార్ట్​ఫోన్​లో​ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,500mAh బ్యాటరీని అందించనుంది.

Vivo V23e 5G: వివో వి23ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్.. అద్భుతమైన ఫీచర్లతో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్

వన్​ప్లస్​ బడ్స్ Z2 స్పెసిఫికేషన్లు

వన్​ప్లస్​ బడ్స్ Z2 బ్లూటూత్ v5.2 కనెక్టివిటీతో వస్తుంది. మెరుగైన ఆడియో ఎక్స్​పీరియన్స్​ కోసం యాక్టివ్​ నాయిస్​ క్యాన్సిలేషన్ సపోర్ట్​ను అందించనుంది. ఈ బడ్స్​ 40dB వరకు నాయిస్‌ను తగ్గించగలవు. ఏఎన్​సీ మూడు మైక్రోఫోన్లు, వాయిస్ కాలింగ్ సపోర్ట్​తో వస్తుంది. వన్​ప్లస్​ బడ్స్​ Z2 టీడబ్ల్యూఎస్​ ఇయర్‌బడ్స్​ IP55 -సర్టిఫికేషన్​తో వస్తాయి. ఈ ఇయర్‌బడ్స్‌ 40mAh బ్యాటరీతో వస్తాయి. వీటిని ఒక్కసారి ఫుల్​ ఛార్జ్‌ చేస్తే 38 గంటల బ్యాటరీ లైఫ్​ను అందించగలవని వన్​ప్లస్​ పేర్కొంది. ఇది ఏడు గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది.

First published:

Tags: Mobile App, ONE PLUS, Technology

ఉత్తమ కథలు