ప్రముఖ చైనా మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. వచ్చే ఏడాది లాంచ్ కాబోయే కొన్ని సెలక్టెడ్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్లను నాలుగు సంవత్సరాల పాటు అందిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఐదేళ్ల వరకు వీటికి సెక్యూరిటీ అప్డేట్లను కూడా ఆఫర్ చేయనుంది. అయితే ఈ అడిషనల్ ఓఎస్ అప్డేట్స్ పొందనున్న స్మార్ట్‌ఫోన్స్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 2023లో లాంచ్ కానున్న ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లకు ఈ అప్డేట్స్ వర్తించే అవకాశం ఉంది. సాధారణంగా మొబైల్ తయారీ కంపెనీలు మూడేళ్ల వరకు ఓఎస్ అప్డేట్స్ను ఆఫర్ చేస్తుంటాయి. అయితే వన్‌ప్లస్ నాలుగేళ్ల కాలానికి ఓఎస్ అప్డేట్స్ ఆఫర్ చేయడం గమనార్హం.
డివైజ్‌లను దీర్ఘకాలం వినియోగించాలి
నాలుగేళ్ల పాటు ఆక్సిజన్ ఓఎస్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తున్నట్లు వన్‌ప్లస్ అధికారిక కమ్యూనిటీ పోస్ట్‌లో పేర్కొన్న విషయాన్ని సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ హెడ్ గ్యారీ చెన్ వెల్లడించారు. వన్‌ప్లస్ యూజర్లు తమ డివైజ్‌లను దీర్ఘకాలంగా వినియోగించాలని కంపెనీ కోరుకుంటోందని చెప్పారు. ఈ కొత్త అప్డేట్ పాలసీ కారణంగా లెటెస్ట్ సెక్యూరిటీ, ఫంక్షన్ ఫీచర్స్‌ను యూజర్లు తమ ఫోన్లలో యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని గ్యారీ చెన్ తెలిపారు.
అధికారిక పోస్ట్
వన్‌ప్లస్ అధికారిక పోస్ట్‌లో.. యూజర్-బేస్డ్ కంపెనీగా, యూజర్స్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి చేయగలిగినదంతా చేస్తామని తెలిపింది. ఎక్కువ మంది యూజర్స్ వారి డివైజ్‌లను దీర్ఘకాలంగా ఉపయోగించాలని కోరుకుంటున్నామని, అందుకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కొత్త అప్డేట్ పాలసీ వన్‌ప్లస్ సిగ్నేచర్ ఫాస్ట్, స్మూత్ ఎక్స్పీరియన్స్ అందించడానికి అవసరమైన సెక్యూరిటీ, సరికొత్త ఫీచర్లకు యాక్సెస్ అందిస్తుందని తెలిపింది.
ఫ్లాగ్షిప్ ఫోన్లకు Oxygen OS అప్డేట్స్
ప్రస్తుతం కంపెనీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ OnePlus 8, OnePlus 9, OnePlus 10 సిరీస్‌లకు మాత్రమే మూడు మేజర్ Oxygen OS అప్డేట్స్ను, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది. ఇక మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్స్ అయిన OnePlus 7, OnePlus Nord, OnePlus Nord 2 వంటి వాటికి రెండు ప్రధాన OS అప్డేట్లను మాత్రమే అందిస్తుంది.
OnePlus 8 సిరీస్ కోసం ఇటీవల కంపెనీ Android 13-బేస్డ్ ఆక్సిజన్ OS 13 అప్డేట్ను రిలీజ్ చేసింది. OnePlus 8 సిరీస్‌లోని OnePlus 8, OnePlus 8 Pro, OnePlus 8T స్మార్ట్ ఫోన్లకు ఈ అప్డేట్ వర్తించనుంది. ఆండ్రాయిడ్ 13 అప్డేట్ OnePlus 10 Pro కోసం సెప్టెంబర్‌లో, OnePlus 9 లైనప్ కోసం నవంబర్‌లో కంపెనీ రిలీజ్ చేసింది.
క్వాంటం యానిమేషన్ ఇంజిన్‌తో..
ఈ అప్డేట్ కంపెనీ క్వాంటం యానిమేషన్ ఇంజిన్ 4.0తో వచ్చింది. న్యూ బిహేవియర్ రికగ్నిషన్ ఫీచర్, రియల్- వరల్డ్ ఫిజికల్ మోషన్ ఇన్ యానిమేషన్, ఆప్టిమైజ్డ్ ఫాంట్స్, కనెక్టివిటీ, పర్సనలైజేషన్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, హెల్త్ అండ్ డిజిటల్ వెల్బీంగ్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, గేమింగ్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ అప్‌గ్రేడ్స్ వంటి వాటితో ఈ అప్డేట్ వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ONE PLUS, Smartphones