హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Pad: వన్‌ప్లస్ నుంచి త్వరలో టాబ్లెట్ లాంచ్.. స్పెసిఫికేషన్స్, డిజైన్, ధర, ఇతర వివరాలు..

OnePlus Pad: వన్‌ప్లస్ నుంచి త్వరలో టాబ్లెట్ లాంచ్.. స్పెసిఫికేషన్స్, డిజైన్, ధర, ఇతర వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వన్‌ప్లస్ కంపెనీ మరో కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను సంస్థ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

చైనీస్ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) ప్రొడక్ట్స్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీల విభాగంలో భారత మార్కెట్‌లో గణనీయమైన వాటా ఉన్న ఈ సంస్థ, ఫిబ్రవరి 7న మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. తర్వాతి సిరీస్‌లో వన్‌ప్లస్ 11, వన్‌ప్లస్ 11R మోడళ్లను తీసుకురానుంది. అయితే అదే సమయంలో మరో కొత్త ప్రొడక్ట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను సంస్థ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అఫీషియల్ Cloud11 ఈవెంట్ పేజీలో 'OnePlus Pad'కు సంబంధించిన ఇమేజ్‌లు బహిర్గతం అయ్యాయి. దీనికి సంబంధించి లీకైన ఇమేజెస్‌ను ఇండస్ట్రీ టిప్‌స్టర్ ప్లాట్‌ఫామ్ @OnLeaks కూడా షేర్ చేసింది. దీంతో కంపెనీ టాబ్లెట్ డివైజ్‌ను కూడా ఫిబ్రవరి 7న లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

ఎక్స్‌పెక్టెడ్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ విడుదల చేసిన అధికారిక ఇమేజ్ ప్రకారం.. ఐప్యాడ్ ప్రోలో ఉన్న స్లిమ్ బెజెల్స్, సింగిల్ లెన్స్, ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన కెమెరా మాడ్యూల్, రియర్ గ్రీనిష్ -మ్యాటే ఫినిష్ వంటి ఫీచర్స్ వన్‌ప్లస్ ప్యాడ్ టాబ్లెట్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ టాబ్లెట్ తయారీలో ఉపయోగించిన మెటీరియల్స్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే దీన్ని అల్యూమినియంతో రూపొందించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్టైలిష్ లుక్ కోసం డివైజ్‌లో ఫ్లాట్ సైడ్స్ ఉన్నట్లు లీకైన ఇమేజ్ బట్టి తెలుస్తోంది.

లాంచ్ కానున్న ఇతర ప్రొడక్ట్స్

వన్‌ప్లస్ ప్యాడ్‌తో పాటు వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11R 5జీ, వన్‌ప్లస్ బడ్స్ Pro 2, వన్‌ప్లస్ టీవీ 65 Pro Q2 వంటి డివైజ్‌లను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ప్యాడ్ రేంజ్, ధర వివరాలపై ఇప్పటికీ స్పష్టత లేదు.

వన్‌ప్లస్ 11 ప్రత్యేకతలు

అప్‌కమింగ్ వన్‌ప్లస్ 11 ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో రానుంది. 12GB RAM +256GB బేస్ మోడల్‌ రూ.54,999 ప్రారంభ ధరతో లాంచ్ కావచ్చు. 16GB RAM +256GB వేరియంట్ ధర రూ. 59,999, 16GB RAM +512GB వేరియంట్ ధర రూ.66,999గా ఉండవచ్చు.

వన్‌ప్లస్‌ 11 స్మార్ట్‌ఫోన్‌ కొత్త క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ బేస్డ్‌ ColorOS 13.0పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల QHD+ Samsung LTPO 3.0 AMOLED డిస్‌ప్లే, 20.1:9 యాస్పెక్ట్ రేషియో,120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుంది. 1300 నిట్స్ వరకు పీక్‌ బ్రైట్నెస్‌ 525ppi పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్‌, HDR, డాల్బీ విజన్ వంటి ఇతర ఫీచర్లతో రానుంది.

First published:

Tags: 5G Smartphone, Oneplus

ఉత్తమ కథలు