ONEPLUS OFFICIALLY ANNOUNCED ONEPLUS 10 PRO SMARTPHONE SPECIFICATIONS SS
OnePlus 10 Pro: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్... స్పెసిఫికేషన్స్ ప్రకటించిన కంపెనీ
OnePlus 10 Pro: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్... స్పెసిఫికేషన్స్ ప్రకటించిన కంపెనీ
OnePlus 10 Pro | వన్‌ప్లస్ నుంచి త్వరలో వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
వన్‌ప్లస్ ఫ్యాన్స్ వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro) స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కన్నా ముందే వన్‌ప్లస్ కంపెనీ అధికారికంగా వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్‌ను వెల్లడించడం విశేషం. వన్‌ప్లస్ ఫౌండర్, సీఈఓ Pete Lau ట్విట్టర్లో వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్స్ జాబితాను పోస్ట్ చేశారు. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ఉండటం విశేషం. ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను గతేడాది క్వాల్కమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే చిప్సెట్ చైనాలో లేటెస్ట్గా రిలీజ్ అయిన రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro) స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే... ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, LTPO ప్యానెల్‌తో ఫ్లూయిడ్ అమొలెడ్ డిస్ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ SuperVOOC ఛార్జింగ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు 65వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చాయి.
వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరా సెటప్‌ను హ్యాసిల్బ్లేడ్తో కలిసి రూపొందించింది వన్‌ప్లస్. ఇందులో 48+50+8 మెగాపిక్సెల్ సెన్సార్లతో మూడు కెమెరాలు ఉంటాయి. డ్యూయెల్ ఆప్టికల్ ఇమేజ్ స్పెషలైజేషన్ (OIS) ఫీచర్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఏ కెమెరా సెన్సార్లు ఉంటాయన్న విషయాన్ని వెల్లడించలేదు వన్‌ప్లస్.
వన్‌ప్లస్ 10 ప్రో ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, VoLTE, VoWiFi లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ 10 ప్రో ర్యామ్ ఎంత, స్టోరేజ్ ఎంత అన్న వివరాలు వెల్లడించలేదు. ఇప్పటివరకు వన్‌ప్లస్ అధికారిక ప్రకటించిన ఫీచర్స్ ఇవే. మిగతా ఫీచర్ల గురించి తెలియాల్సి ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో రిలీజ్ కానుంది కాబట్టి ఇదే చిప్సెట్తో ఉన్న రియల్మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. క్వాల్కమ్ రిలీజ్ చేసిన ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌తో మరిన్ని మొబైల్స్ కూడా రానున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.