వన్‌ప్లస్ నార్డ్... ఇటీవల కాలంలో ఇంత హైప్ వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ లేదు. లీక్స్, టీజర్స్, ఇన్విటేషన్స్, ఆగ్యుమెంటెడ్ రియాల్టీ-AR ఈవెంట్ ఇలా ప్రతీ అంశం పెద్ద న్యూస్ అయింది. వన్‌ప్లస్ నార్డ్పై అంచనాలు ఆ స్థాయిలో పెరిగిపోయాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఇందుకు కారణం... ప్రీమియం సెగ్మెంట్లో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన వన్‌ప్లస్... మిడ్ రేంజ్ సెగ్మెంట్లో అడుగుపెడుతుండటమే కారణం. దీంతో వన్‌ప్లస్ నార్డ్ ధర రూ.20,000 ఉంటుందనుకున్నారు. కానీ వన్‌ప్లస్ నార్డ్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ ప్రారంభ ధర రూ.24,999. దీంతో ఫ్యాన్స్ షాకయ్యారు. వన్‌ప్లస్ నార్డ్ ధర చాలా ఎక్కువ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వన్‌ప్లస్ కంపెనీకి ఇది చీపెస్ట్ ఫోన్ అయినా ఫ్యాన్స్ మాత్రం ధర ఎక్కువని ఫీలవుతున్నారు.
Realme C11: కాసేపట్లో రియల్మీ సీ11 సేల్... తక్కువ ధరకే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
Infinix Smart 4 Plus: భారీ డిస్ప్లే, 6,000ఎంఏహెచ్ బ్యాటరీ... ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 మాత్రమే
ఇక వన్‌ప్లస్ నార్డ్ ప్రత్యేకతలు చూస్తే 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్, 4,115ఎంఏహెచ్ బ్యాటరీ, 48మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5జీ స్మార్ట్‌ఫోన్. అంటే 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు ఫోన్ మార్చాల్సిన అవసరం లేకుండా ఇదే ఫోన్లో 5జీ నెట్వర్క్ వాడుకోవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 6జీబీ+64జీబీ వేరియంట్‌ను ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజీవ్‌గా రిలీజ్ చేస్తోంది కంపెనీ. ధర రూ.24,999. అది కూడా ఈ రేటుకు కొనాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999. ఈ రెండు వేరియంట్లు ఆగస్ట్ 4 నుంచి అందుబాటులో ఉంటాయి. 6జీబీ+64జీబీ వేరియంట్ మాత్రం ఇండియాకు సెప్టెంబర్‌లో రానుంది. ఇక వన్‌ప్లస్ నార్డ్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ కూడా లాంఛ్ అయ్యాయి. ధర రూ.4,999.
Samsung Galaxy A21s: గుడ్ న్యూస్... సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ ధర తగ్గింది
Redmi Note 9: అదిరిపోయే ఫీచర్స్‌తో రెడ్మీ నోట్ 9 రిలీజ్... ధర కూడా తక్కువే
వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.44 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 765జీ
రియర్ కెమెరా: 48+8+5+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32+8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,115ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆక్సిజన్ ఓఎస్ 10.0 + ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్:
ధర:
6జీబీ+64జీబీ- రూ.24,999
8జీబీ+128జీబీ- రూ.27,999
12జీబీ+256జీబీ- రూ.29,999