మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? ఇప్పుడు మార్కెట్లో ఉన్న మోడల్స్‌లో ఏదో ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఓ వారం రోజులు ఆగండి. మరికొన్ని స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. అందుకే ఓ వారం పది రోజులు ఆగితే మీరు కొనాలనుకునే స్మార్ట్‌ఫోన్, కొత్తగా రిలీజ్ అయిన మోడల్స్‌ని కంపేర్ చేసి బెస్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ నెలలో మార్కెట్లోకి రాబోతున్న ఆ కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఏవీ? వాటి ధరలు ఎంత ఉండొచ్చో తెలుసుకోండి.
OnePlus Nord: ఈ మధ్య స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వన్‌ప్లస్ నార్డ్. ప్రీమియం స్మార్ట్ఫోన్లతో పేరు తెచ్చుకున్న వన్‌ప్లస్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వన్‌ప్లస్ నార్డ్ రిలీజ్ చేయబోతోంది. జూలై 21 సాయంత్రం 7.30 గంటలకు వన్‌ప్లస్ నార్డ్ ప్రపంచానికి పరిచయం కాబోతోంది. స్నాప్‌డ్రాగన్ 765జీ 5జీ ప్రాసెసర్, 6.4 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే డిస్ప్లే, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్ సేల్ ఎప్పుడు మొదలు కానుందో లాంఛింగ్ ఈవెంట్లో ప్రకటిస్తారు.
OnePlus Nord: ప్రపంచం ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇవాళే రిలీజ్... విశేషాలు ఇవే
Redmi Note 9: అదిరిపోయే ఫీచర్స్‌తో రెడ్మీ నోట్ 9 రిలీజ్... ధర కూడా తక్కువే
Redmi Note 9: షావోమీకి చెందిన రెడ్మీ నోట్ 9 జూలై 20న రిలీజ్ అయింది. జూలై 24న షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో సేల్ మొదలవుతుంది. రెడ్మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.11,999 మాత్రమే. 5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మరిన్ని వివరాల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
Samsung Galaxy M31s: సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 30న రిలీజ్ చేస్తోంది కంపెనీ. 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ధర రూ.20,000 లోపే ఉంటుందని అంచనా.
WhatsApp: వాట్సప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్... ఇలా వాడుకోండి
JioMart: జియోమార్ట్ యాప్ వచ్చేసింది... ఆఫర్స్ ఇవే
Infinix 4 Plus: ఇన్ఫీనిక్స్ 4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ జూలై 21న రిలీజైంది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.82 అంగుళాల భారీ డిస్ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.7,999 మాత్రమే. త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది.
Realme 6i: రియల్మీ నుంచి మరో కొత్త ఫోన్ రాబోతోంది. రియల్మీ 6ఐ స్మార్ట్‌ఫోన్ జూలై 24న రిలీజ్ కానుంది. మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్, క్వాడ్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ధర రూ.15,000 లోపు ఉండొచ్చని అంచనా.
Asus ROG Phone 3: ఏసుస్ నుంచి ప్రీమియం బడ్జెట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఏసుస్ రోగ్ ఫోన్ 3 జూలై 22న లాంఛ్ కానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.