వన్‌ప్లస్ నార్డ్... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఫోన్ ఇది. ఇన్నాళ్లూ ప్రీమియం స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన వన్‌ప్లస్ తొలిసారి బడ్జెట్ సెగ్మెంట్లో వన్‌ప్లస్ నార్డ్ మోడ్‌ను పరిచయం చేయబోతోంది. అందుకే ఇన్విటేషన్ దగ్గర్నుంచి ఫోన్ లాంఛింగ్ వరకు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రమోషన్ నిర్వహిస్తోంది కంపెనీ. జూన్ 21న వన్‌ప్లస్ నార్డ్ ఇండియాలో లాంఛ్ కాబోతోంది. జూన్ 15 మధ్యాహ్నం 1.30 గంటలకు అమెజాన్ ఇండియాలో ప్రీ-ఆర్డర్స్ మొదలు కానున్నాయి. ప్రీ ఆర్డర్ చేసే కస్టమర్లకు రూ.5,000 విలువైన బెనిఫిట్స్ కూడా ప్రకటించింది కంపెనీ. ప్రీ ఆర్డర్ చేసేవారికి ఓ గిఫ్ట్ బాక్స్ పంపించనుంది. అంతేకాదు... ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ ప్రీ-ఆర్డర్ చేసి ఆగస్ట్ 31 లోగా ఫోన్ కొంటే మరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది.
Realme C11: తక్కువ ధరకే రియల్మీ సీ11 స్మార్ట్‌ఫోన్ రిలీజ్
Redmi Note 8: రెడ్మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్ రేట్ మళ్లీ పెరిగింది... ధర ఎంతంటే
OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ ప్రీ ఆర్డర్ చేయండి ఇలా
ముందుగా అమెజాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌లో లాగిన్ కావాలి.
హోమ్ పేజీలో OnePlus Nord pre-order లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
రూ.499 పేమెంట్ చేసి వన్‌ప్లస్ నార్డ్ ప్రీ ఆర్డర్ చేయాలి.
జూలై 21న వన్‌ప్లస్ నార్డ్ లాంఛ్ అయిన తర్వాత ఫోన్ కొనొచ్చు.
జూలై 21న ప్రపంచంలోనే తొలిసారి ఆగ్యుమెటెడ్ రియాల్టీ-AR స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహిస్తోంది వన్‌ప్లస్. అంతేకాదు... ఈ ఈవెంట్ పాస్‌లను రూ.99 చొప్పున అమ్ముతోంది. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌పై ఇప్పటికే అనేక లీక్స్ వచ్చాయి. ఇప్పుడు మరిన్ని లీక్స్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.
WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్ వచ్చేసింది... వాడుకోండి ఇలా
Smartphone: మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్... ధర రూ.5,774 మాత్రమే
వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 765జీ 5జీ
రియర్ కెమెరా: 48+8+5+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32+8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,115 ఎంఏహెచ్ బ్యాటరీ