హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Nord N20 SE: రూ.15,000 లోపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... రిలీజ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

OnePlus Nord N20 SE: రూ.15,000 లోపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... రిలీజ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

OnePlus Nord N20 SE: రూ.15,000 లోపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... రిలీజ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

OnePlus Nord N20 SE: రూ.15,000 లోపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... రిలీజ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్

OnePlus Nord N20 SE | ఏ కంపెనీ అయినా స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్‌కు వారం రోజుల ముందు నుంచే ప్రమోషన్ చేస్తుంది. కానీ ఓ వన్‌ప్లస్ స్మార్ట్‌పోన్ సైలెంట్‌గా లాంఛ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వన్‌ప్లస్ ఇండియాలో సైలెంట్‌గా స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిందా? ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) కొత్త స్మార్ట్‌ఫోన్ కనిపించడంతో వన్‌ప్లస్ ఫ్యాన్స్‌లో ఇదే డౌట్. వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ (OnePlus Nord N20 SE) స్మార్ట్‌ఫోన్ ఆగస్టులో గ్లోబల్ మార్కెట్‌లో లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఎప్పుడు లాంఛ్ అవుతుందా అని వన్‌ప్లస్ (OnePlus) ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అవడం ఆశ్చర్యపరుస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ఇండియాలో లాంఛ్ కాకముందే ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ పొరపాటున లిస్ట్ చేశారా? లేక రిలీజ్ చేయకుండా డైరెక్ట్‌గా సేల్ ప్రారంభించారా? అన్న చర్చ జరుగుతోంది.

ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ లిస్టింగ్ ప్రకారం ఈ మొబైల్ ధర రూ.14,990. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ , పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్ రూ.520 నుంచి ప్రారంభం అవుతుంది.

Room Heater: రూమ్ హీటర్ వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు రావొచ్చు... ఈ జాగ్రత్తలు తప్పనిసరి

వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో6.56 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 12 + ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లావా జెడ్3, ఒప్పో ఏ55, పోకో సీ31, ఒప్పో ఏ16 స్మార్ట్‌ఫోన్లలో ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4జీబీ ర్యామ్ సపోర్ట్ చేస్తే 64జీబీ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ అధికారికంగా లాంఛ్ చేసిందా? చేస్తుందా? అన్న విషయం తెలియాల్సి ఉంది.

WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్... ఇక మీ ఛాట్స్ లీక్ అయ్యే ఛాన్స్ లేదు

ఇక ఇండియాలో వన్‌ప్లస్ నుంచి చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.18,999. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫీచర్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

First published:

Tags: Oneplus, Smartphone

ఉత్తమ కథలు