Home /News /technology /

ONEPLUS NORD N20 LAUNCH OF ANOTHER MID RANGE PHONE FROM ONEPLUS 64 MP TRIPLE CAMERA WITH TOP FEATURES RELEASED GH VB

OnePlus Nord N20: వన్‌ప్లస్ నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్ లాంచ్.. 64 MP ట్రిపుల్ కెమెరాతో పాటు టాప్ ఫీచర్లు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సత్తా చాటేందుకు వన్‌ప్లస్ కంపెనీ రెడీ అయింది. ఈ సంస్థ మరో మిడ్ రేంజ్ ఫోన్‌ను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్‌ 20 5జీ (OnePlus Nord N20 5G) పేరుతో కొత్త మోడల్‌ను అమెరికాలో అధికారికంగా ఆవిష్కరించింది.

ఇంకా చదవండి ...
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్(Smartphone) మార్కెట్‌లో(Market) సత్తా చాటేందుకు వన్‌ప్లస్(OnePlus) కంపెనీ రెడీ అయింది. ఈ సంస్థ మరో మిడ్ రేంజ్ ఫోన్‌ను(Mid Range Phone) ఆవిష్కరించింది. వన్‌ప్లస్ నార్డ్ ఎన్‌ 20 5జీ (OnePlus Nord N20 5G) పేరుతో కొత్త మోడల్‌ను(New Model) అమెరికాలో అధికారికంగా ఆవిష్కరించింది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్(Trippel Camera Setup), ఫాస్ట్ ఛార్జింగ్‌(Fast Charging), సూపర్ పవర్డ్ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లేతో కూడిన మిడ్ రేంజ్ 5G ఫోన్‌ ఇది. ఈ సరికొత్త డివైజ్ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ నార్డ్ N20 5G ధర
OnePlus Nord N20 5G ఫోన్ ఏకైక 6GB/128GB వేరియంట్లోనే లభిస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ కేవలం సింగిల్ వేరియంట్‌నే ఆవిష్కరించింది. యూఎస్‌లో దీని ధర 282 డాలర్లు (సుమారు రూ. 21,600)గా ఉంది. ఈ ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని షిప్పింగ్ ఏప్రిల్ 28న ఉత్తర అమెరికాలో T-Mobile ద్వారా ప్రారంభమవుతుంది. Nord N20 5G ఫోన్ ఉత్తర అమెరికాకు మాత్రమే ప్రత్యేకం కావచ్చు. కానీ ఇది OnePlus Nord CE 2 Lite రీబ్రాండెడ్ వెర్షన్ లాగా కనిపిస్తోంది. ఈ లైట్ వేరియంట్ కొన్ని మార్పులతో ఏప్రిల్ 28న ఇండియాలో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ N20 స్పెసిఫికేషన్‌లు కూడా ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన Oppo F21 Pro 5G మాదిరిగానే ఉన్నాయి.

Apple iPhone: యాపిల్ నుంచి మరో వినూత్న ఐఫోన్.. మొదటిసారి వాటి ఉత్పత్తిపై దృష్టి పెట్టిన కంపెనీ..


స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు
వన్‌ప్లస్ నార్డ్ N20 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6GB RAMతో వస్తుంది. 128GB వరకు విస్తరించగలిగే స్టోరేజ్ ఆప్షన్ దీని సొంతం. ఈ ఫోన్‌ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేసే 4,500 mAh బ్యాటరీతో వస్తుంది. ఇండియాలో ఇటీవల లాంచ్ అయిన OnePlus Nord CE 2 మాదిరిగానే కొత్త ఫోన్ ఫీచర్లు ఉన్నాయి. Nord N20 వేరియంట్ కస్టమ్ OxygenOS స్కిన్‌తో Android 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌, 6.43-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో ఫోన్ మంచి ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

నార్డ్ N20 ఫోన్ ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 64 MP ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రావైడ్ షూటర్, 2 MP డెప్త్ సెన్సార్ ఉంటాయి. అయితే ఫ్రంట్ కెమెరా లెన్స్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. అయితే సెల్ఫీ కెమెరా కెపాసిటీ 16 MP షూటర్‌గా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Oneplus, Technology

తదుపరి వార్తలు