ONEPLUS NORD N20 5G TO BE LAUNCHED WITH SNAPDRAGON 695 SOC SPORT TRIPLE REAR CAMERAS NS GH
OnePlus Nord N20 5G: త్వరలోనే వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 20 5G స్మార్ట్‌ఫోన్.. ఆన్లైన్లో లీకైన ఫీచర్ల వివరాలివే!
ప్రతీకాత్మక చిత్రం
వన్ ప్లస్ త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే వన్‌ప్లస్ నార్డ్ N20 5G(OnePlus Nord N20 5G). గతేడాది ప్రారంభించిన నార్డ్ ఎన్10 5జీకి కొనసాగింపుగా దీన్ని తీసుకురానుంది.
భారత మార్కెట్లో ప్రీమియం బ్రాండ్‌గా కొనసాగుతోన్న వన్‌ప్లస్ నార్డ్ (OnePlus Nord) నుంచి వరుసగా స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. వన్‌ప్లస్ త్వరలోనే మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అదే వన్‌ప్లస్ నార్డ్ N20 5G (OnePlus Nord N20 5G). గతేడాది ప్రారంభించిన నార్డ్ ఎన్10 5జీకి కొనసాగింపుగా దీన్ని తీసుకురానుంది. వన్‌ప్లస్ నార్డ్ N20 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ట్రిపుల్ రియర్ కెమెరాలు, బ్యాక్ ప్యానెల్, మెటల్ ఫ్రేమ్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. లీకైన సమాచారం ప్రకారం, దీనిలో హోల్-పంచ్ డిస్‌ప్లే, బాక్సీ డిజైన్‌ను కూడా అందించింది. వన్‌ప్లస్ నార్డ్ N20 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
ప్రముఖ టిప్‌స్టర్ స్టీవ్ హెమర్‌స్టోఫర్ (ఆన్‌లీక్స్) వన్‌ప్లస్ నార్డ్ ఎన్ 20 5జీ స్పెసిఫికేషన్లను ఆన్లైన్ ద్వారా పంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ హోల్-పంచ్ కటౌట్ స్క్రీన్‌తో వస్తుందని, ఛాంఫెర్డ్ ఎడ్జెస్‌తో ఫ్లాట్ ఫ్రేమ్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. వన్‌ప్లస్ నార్డ్ N20 5G కుడి భాగంలో పవర్, వాల్యూమ్ బటన్లు, ఎడమ వైపున సిమ్ కార్డ్ ఇన్సర్ట్ స్లాట్ వంటివి చేర్చనుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరిశీలిస్తే.. 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ వంటివి అందించనుంది. ఎగువ భాగంలో నాయిస్ క్యాన్సిలేషన్ కోసం రెండు మైక్‌లను అందించనుంది. Budget Smartphone: కేవలం రూ. 6,200కే 6000mAh భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
వన్‌ప్లస్ ఎన్ 10 5జీ సక్సెసర్‌గా..
వన్‌ప్లస్ నార్డ్ N20 5G లీకైన స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. దీని వెనుకవైపు మూడు సెన్సార్లను చేర్చనుంది. ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు కనిపిస్తుంది. ఈ ఫోన్ గ్రే, పర్పుల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. టిప్‌స్టర్ ప్రకారం, వన్‌ప్లస్ నార్డ్ N20 5G స్మార్ట్‌ఫోన్ 6.43 -అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే వస్తుంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించనున్నారు. Airtel: ఎయిర్టెల్ యూజర్లకు రోజూ అదనంగా 500 ఎంబీ డేటా... ఎలా పొందాలంటే
వన్‌ప్లస్ నార్డ్ N20 5G వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా, రెండు అదనపు 2 -మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలను అందించనుంది. దీని ముందు భాగంలో వీడియో చాట్‌ల కోసం ప్రత్యేకంగా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చనున్నట్లు నివేదిక పేర్కొంది. కంపెనీ ఈ ఫోన్‌ను వన్‌ప్లస్ నార్డ్ N20 5Gకి బదులుగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5G పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉందని టిప్‌స్టర్ స్టీమ్ హెమర్‌స్టోఫర్ తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.