OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే... మరిన్ని లీక్స్

OnePlus Nord | వన్‌ప్లస్ రిలీజ్ చేయబోయే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్ ఫీచర్స్‌పై మరిన్ని లీక్స్ వచ్చాయి. వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండొచ్చో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 13, 2020, 6:57 PM IST
OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే... మరిన్ని లీక్స్
OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే... మరిన్ని లీక్స్ (image: oneplus/twitter)
  • Share this:
వన్‌ప్లస్ నార్డ్... ఇటీవల కాలంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చినంత హైప్ ఇంకే స్మార్ట్‌ఫోన్‌కు రాలేదేమో. ఓవైపు భారత ప్రభుత్వం చైనా యాప్స్‌ని బ్యాన్ చేయడం, మరోవైపు చైనా ప్రొడక్ట్స్‌ని బ్యాన్ చేయాలన్న నినాదాలతో యాంటీ చైనా సెంటిమెంట్ పెరిగిపోతుండటం ఇప్పుడు చూస్తున్నాం. అయినా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ సరికొత్త మోడల్‌ను ఇండియాలో లాంఛ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. జూన్ 21న వన్‌ప్లస్ నార్డ్ ఇండియాలో లాంఛ్ కాబోతోంది. ఈ ఫోన్ లాంఛింగ్‌కు సంబధించిన ప్రమోషన్‌ను నెల రోజుల ముందు నుంచే చేస్తోంది. ఈ ఫోన్‌పై ఇంత ఆసక్తి పెరుగుతూ ఉండటానికి కారణం... ఇన్నాళ్లూ ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్లు అమ్ముతున్న వన్‌ప్లస్ ఇప్పుడు మిడ్ రేంజ్ సెగ్మెంట్‌పై దృష్టిపెడుతూ కొత్త మోడల్ రిలీజ్ చేస్తుండటమే. ఇన్నాళ్లూ బడ్జెట్ ఎక్కువని వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనలేనివారంతా ఇప్పుడు వన్‌ప్లస్ నార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రపంచంలోనే తొలిసారి ఆగ్యుమెటెడ్ రియాల్టీ-AR స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ ఈవెంట్ నిర్వహిస్తోంది వన్‌ప్లస్. అంతేకాదు... ఈ ఈవెంట్ పాస్‌లను రూ.99 చొప్పున అమ్ముతోంది. ఇవా ఇన్విటేషన్ దగ్గర్నుంచి ఫోన్ లాంఛింగ్ వరకు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ ప్రమోషన్ నిర్వహిస్తోంది కంపెనీ. మరోవైపు వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌పై ఇప్పటికే అనేక లీక్స్ వచ్చాయి. ఇప్పుడు మరిన్ని లీక్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.


వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్‌ప్లే: 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే

ర్యామ్: 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 765జీ 5జీ
రియర్ కెమెరా: 48+8+5+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32+8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,115 ఎంఏహెచ్ బ్యాటరీ
Published by: Santhosh Kumar S
First published: July 13, 2020, 6:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading