హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Nord Launch: కాసేపట్లో వన్‌ప్లస్ నార్డ్ లాంఛింగ్... లైవ్ చూడండి ఇలా

OnePlus Nord Launch: కాసేపట్లో వన్‌ప్లస్ నార్డ్ లాంఛింగ్... లైవ్ చూడండి ఇలా

OnePlus Nord: ప్రపంచం ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇవాళే రిలీజ్... విశేషాలు ఇవే
(image: Oneplus)

OnePlus Nord: ప్రపంచం ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇవాళే రిలీజ్... విశేషాలు ఇవే (image: Oneplus)

OnePlus Nord Launch Today | స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ ఇవాళ రిలీజ్ కాబోతోంది. విశేషాలు తెలుసుకోండి.

  వన్‌ప్లస్ నార్డ్... ఇటీవల కాలంలో ఇంత హైప్ వచ్చిన స్మార్ట్‌ఫోన్ మరొకటి లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లను మాత్రమే రిలీజ్ చేసిన వన్‌‌ప్లస్ తొలిసారి మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టడం ఒక కారణం. ఇక ప్రపంచంలోనే తొలిసారి ఆగ్యుమెంటెడ్ రియాల్టీ-AR ద్వారా స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్ ఈవెంట్‌ను నిర్వహించడం మరో కారణం. అందుకే స్మార్ట్‌ఫోన్ యూజర్లతో పాటు వన్‌ప్లస్ ఫ్యాన్స్... వన్‌ప్లస్ నార్డ్ లాంఛింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూలై 21 సాయంత్రం 7.30 గంటలకు వన్‌ప్లస్ నార్డ్ లాంఛ్ కాబోతోంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వన్‌ప్లస్ నార్డ్ ఏఆర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్‌లో ఈవెంట్ చూడొచ్చు. ఏఆర్ ఈవెంట్ చూడాలనుకునేవారి కోసం ఇప్పటికే ఇన్విటేషన్లను అమ్మింది కంపెనీ. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ విషయానికొస్తే స్నాప్‌డ్రాగన్ 765జీ 5జీ ప్రాసెసర్, 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ కూడా లాంఛింగ్ కూడా ఉంటుంది.

  వన్‌ప్లస్ నార్డ్ స్పెసిఫికేషన్స్ (అంచనా)

  డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే

  ర్యామ్: 8జీబీ, 12జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ

  ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 765జీ 5జీ

  రియర్ కెమెరా: 48+8+5+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 32+8 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 4,115 ఎంఏహెచ్ బ్యాటరీ

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Oneplus, Smartphone

  ఉత్తమ కథలు