Home /News /technology /

ONEPLUS NORD IS GETTING HUGE PRE BOOKINGS HOW TO GET IT KNOW HERE SK

OnePlus Nord కోసం బుకింగ్స్ వెల్లువ.. మీ సొంతం చేసుకోండిలా..

OnePlus Nord

OnePlus Nord

OnePlus Nord డివైజ్ కోసం ఇప్పటికే చాలా ఎక్కువగా ప్రీ-ఆర్డర్లు వచ్చాయి. అంతేకాకుండా OnePlus Nord ఇప్పటికే Amazon ఇండియాలో అత్యధికంగా ప్రీ-బుక్ చేసిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

  OnePlus సరికొత్త Nord స్మార్ట్‌ఫోన్‌ ప్రతీ ఒక్కరినీ తనవైపు ఆకట్టుకుంటోంది. వినియోగదారులు ఈ బ్రాండ్ అత్యున్నత స్థాయికి చేరుకుందని ఆలోచించడం ప్రారంభించినప్పుడే గ్లోబల్ స్మార్ట్ఫోన్ తయారీసంస్థ సామాన్యులకు అందుబాటు ధరతో అంచనాలకు మించిన OnePlus Nordను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇక ఇప్పుడు మిగిలిఉన్న ఏకైక ప్రశ్నఏమిటంటే, OnePlus Nord ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

  OnePlus Nord డివైజ్ కోసం ఇప్పటికే చాలా ఎక్కువగా ప్రీ-ఆర్డర్లు వచ్చాయి. అంతేకాకుండా OnePlus Nord ఇప్పటికే Amazon ఇండియాలో అత్యధికంగా ప్రీ-బుక్ చేసిన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అవును, వినియోగదారులు పూర్తి మొత్తాన్ని చెల్లించి తమ డివైజ్ ప్రీ-బుక్ చేసుకున్నారు, ఎందుకంటే OnePlus Nord ఉత్తమమైన వాటిని మించి ఉంది (అంతకు మించి). OnePlus విడుదల చేసిన ఆన్లైన్ పాప్-అప్ ద్వారా వినియోగదారులు అవతార్లను సృష్టించి, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయవచ్చు, తద్వారా స్మార్ట్‌ఫోన్ ప్రీ ఆర్డర్ చేయడానికి అర్హత పొందవచ్చు. అంతేకాకుండా, ప్రపంచంలోనే మొట్టమొదటి AR విడుదలలో OnePlus Nord స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. OnePlus Nord తమ అభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపిందనడంలో అతిశయోక్తి లేదు!

  ఆకర్షణీయమైన OnePlus Nord ప్రత్యేకతలు:
  OnePlus Nord గురించి మీరు సందిగ్ధంలో ఉన్నట్లయితే, ఇక్కడ పేర్కొన్న వివరాలను పరిశీలించండి, ఆ తరువాత మీ సందేహాలు తొలగిపోయి దానిని సొంతం చేసుకోవాలనే ఉత్సాహం మీలో తప్పక నెలకొంటుంది. 5G-ఎనేబుల్డ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్, 90Hz రిఫ్రెష్ రేట్తో కూడిన 6.44-inch ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, OnePlus 8 వలే క్వాడ్-కామ్ సేటప్తో పాటు డ్యూయల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు 30T ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 4115 mAh బ్యాటరీ గల ఈ స్మార్ట్‌ఫోన్ రోజంతా నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్లనింటితో పాటు వేర్వేరు మెమరీ, స్టోరేజ్ ఆప్షన్లతో భారతదేశంలో మాత్రమే 6GB+64GB కలయికతో కేవలం INR 24,999 ధరతో సెప్టెంబరులో విడుదలై మార్కెట్లో సరసమైన ధరకే లభించే ఉత్తమమైన స్మార్ట్ఫోన్లలో ఒకటిగా నిలవబోతుంది. ఉత్తమమైన ఈ OnePlus Nord ను మీ సొంతం చేసుకోవడానికి మీరు ఎక్కువ కాలం వేచి ఉండవలసిన అవసరం లేదు. 8GB+128GB OnePlus Nord మోడల్ INR 27,999 ధర వద్ద, అలాగే అధిక స్థాయిలో 12GB+256GB మోడల్ INR 29,999 ధర వద్ద లభిస్తున్నాయి. ఈ రెండు మోడళ్ళు ఈ వారంలో మీ ముందుకు రాబోతున్నాయి.

  ఆగస్టు 6 న రీటైల్ విడుదల:
  ప్రీ-ఆర్డర్ అవకాశాన్ని కోల్పోయినందుకు చింతించకండి. ఆగస్టు 6 నుండి అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ఫోన్ను ఆన్లైన్లో కొనుగోలు చేసి అద్భుతమైన OnePlus Nord అనుభవాన్ని ఆస్వాదించిన మొదటి వ్యక్తి మీరే అవ్వండి. OnePlus Nord ఆన్లైన్లో Amazon India మరియు OnePlus online store లో అలాగే ఆఫ్లైన్లో OnePlus ఎక్స్పీరియన్స్ స్టోర్స్ మరియు OnePlus ఆథరైజ్డ్ స్టోర్లలో ఆగస్టు 6 న విడుదల కానుంది.

  Reliance డిజిటల్ మరియు MyJio లలో ఆగస్టు 7 నుండి అందుబాటులోకి..
  ఈ రోజుల్లో మీరు జియో సేవలను కోల్పోలేరు. Reliance Digital స్టోర్స్, MyJio నుండి కొనుగోలు చేయాలి అనుకునే వినియోగదారుల కోసం OnePlus Nord ఆగస్టు 7 నుండి ఆగస్టు 12 వరకు ఈ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.

  ఇతర స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ పొందలేకపోయిన వినియోగదారులు వీటిపై నిఘా ఉంచడం మంచిది.
  OnePlus, వారి స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరలకే మీరు కొనుగోలు చేయడానికి తగినన్ని అవుట్లెట్లు కలవని నిర్ధారించుకుంటుంది. అందుకోసం ఆగస్టు 12 నుండి OnePlus Nord స్మార్ట్ఫోన్లు అన్ని ధ్రువీకృతమైన ఆఫ్లైన్ రిటైల్ భాగస్వాముల వద్ద అందుబాటులోకి తెస్తుంది. ఇప్పుడు మీకు ముఖ్యమైన తేదీలన్నీ తెలుసు, కావున అమ్మకాలు ప్రారంభమైన వెంటనే మీ OnePlus Nord ను వీలైనంత త్వరగా మీ సొంతం చేసుకోండి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: ONE PLUS, Smart phones, Technology

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు