వచ్చేస్తోంది OnePlus Nord: ప్రపంచపు మొట్టమొదటి AR ప్రాడక్ట్ లాంచ్‌కు ట్యూన్ కండి..

OnePlus Nord Is Coming | ప్రపంచంలో మొట్టమొదటి ఏఆర్ ప్రోడక్ట్ OnePlus Nord లాంచ్‌కి మీరు ఎలా ట్యూన్ కావాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 18, 2020, 2:19 PM IST
వచ్చేస్తోంది OnePlus Nord: ప్రపంచపు మొట్టమొదటి AR ప్రాడక్ట్ లాంచ్‌కు ట్యూన్ కండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
OnePlus ఇటీవలి కాలంలో తమని మరింత ఉత్తమ స్థానంలో నిలిపే ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా మరో ఆవిష్కరణతో ముందుకు వచ్చింది.  త్వరలో రానున్న OnePlus Nord అందరి దృష్టి ఉంది.  ఆ సంస్థ తమ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచంలోనే మొట్టమొదటి AR ప్రాడక్ట్ లాంచ్‌కు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. జులై 21, రాత్రి 7.30 గంటలకు షెడ్యూల్ చేయబడిన ఈవెంట్ కోసం మీ సమయాన్ని కేటాయించండి. అలాగే ఏం జరగబోతుందో ఊహించండి? లాంచ్ ఈవెంట్‌కు మిమ్మల్ని కూడా ఆహ్వానించారు. జరగబోయే లాంచ్ గురించి, అలాగే చరిత్రను సృష్టించండంలో మీరు కూడా భాగస్వామ్యం కావడం కోసం మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ కలవు.

OnePlus Nord యాప్‌ను డౌన్‌లోడ్ చేయండిముందుగా మీరు OnePlus Nord యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. Android వారు ఇక్కడ , అలాగే Apple వారు ఇక్కడ యాప్‌ను పొందండి. AR అనుభవాన్ని ఆస్వాదించడానికి దానిని ఇన్స్టాల్ చేసి, అన్ని అనుమతులను అంగీకరించండి. ఆలా చేసిన తరువాత వెబ్ AR లోడ్ అవుతుంది, తద్వారా లాంచ్ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.యాప్‌ను ఆప్టిమైజ్ చేసి, సెట్టింగ్స్‌ను పరిశీలించండి


OnePlus Nord యాప్ మీరు ముందుగానే సిద్ధం అవడానికి కస్టమ్ అవతార్‌ను సృష్టించే అవకాశం అందిస్తుంది. మీరు ముందుగానే యాప్‌లోని విషయాలను తెలుసుకుని, వాటిని చక్కగా ఉపయోగించుకోగలిగినట్లయితే చివరి నిమిషంలో ఎటువంటి అవాంతరాలు ఎదుర్కొనే అవకాశం ఉండదు. దానర్థం ఈవెంట్ ప్రారంభమవడానికి ముందే వెబ్ AR అనుభవాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు ముందుకు కొనసాగడానికి కొన్ని దశలను పరిశీలించి ఆప్టిమైజ్ చేయవలసి ఉంటుంది.

మీరు ఇక్కడ OnePlus Nord వారి అధికారిక Instagram పేజ్‌ను ఇక్కడ, అలాగే మరిన్ని అప్‌డేట్స్ కోసం దానికై కేటాయించిన వెబ్‌సైట్‌ను ఇక్కడ అనుసరించాలని మేము సూచిస్తున్నాము.

AR లాంచ్ అనుభూతిని ఆస్వాదించండిలాంచింగ్ రోజు, యాప్‌ను తెరవడానికి ముందే మీ ఇంటర్నెట్ కనెక్షన్ గురించి నిర్ధారించుకోండి. మీరు సాధ్యమైనంత ఉత్తమమైన AR స్ట్రీమింగ్ అనుభవాన్ని పొందడం కోసం మీరు యాప్‌లోని కొన్ని సూచనలను పాటించవలసి ఉంటుంది. ఇది ప్రపంచపు మొట్టమొదటి AR ప్రాడక్ట్ లాంచ్, అలాగే మీరు దానిని చూడబోతున్నారు, కాబట్టి ఛార్జింగ్ లేకపోవడం, ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడం వంటి చిన్న చిన్న విషయాలతో మీ ఆసక్తిని కోల్పోకుండా జాగ్రత్త పడండి. ఈ కార్యక్రమం జులై 21 రాత్రి 7.30 గంటలకు జరుగుతుందని మర్చిపోవద్దు. మీరు మర్చిపోకుండా క్యాలెండర్ ఈవెంట్‌ను క్రియేట్ చేసుకోవడం ఉత్తమం.

OnePlus Nord ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే Amazon India లో ప్రారంభమయ్యాయి, అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆగస్టు 31లోగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన బ్యాగ్‌లను అందిస్తుంది. డ్యూయల్-ఫ్రంట్ కెమెరాతో కూడిన క్వాడ్-కెమెరా సెటప్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-inch సూపర్ AMOLED డిస్‌ప్లేతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ 5G సపోర్ట్‌తో స్నాప్‌డ్రాగన్ 765 SoC మరియు 6 GB RAM మరియు 128 GB ఇంటర్నల్ స్టోరెజ్‌ను అందిస్తుంది.

OnePlus Nord తో మరింత ఎత్తుకు ఎదగడం సత్యం. AR లాంచ్ సమయంలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించబోతున్న అదృష్టవంతులలో మీరూ ఒకరు కావచ్చు.

(The writer is an independent Journalist)
Published by: Janardhan V
First published: July 18, 2020, 1:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading