హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus: ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ లాంచ్.. మార్కెట్లోకి రానున్న మరో రెండు మోడల్స్

OnePlus: ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ లాంచ్.. మార్కెట్లోకి రానున్న మరో రెండు మోడల్స్

OnePlus: ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ లాంచ్.. మార్కెట్లోకి రానున్న మరో రెండు మోడల్స్

OnePlus: ఏప్రిల్ 4న వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ ఫోన్ లాంచ్.. మార్కెట్లోకి రానున్న మరో రెండు మోడల్స్

OnePlus: వన్‌ప్లస్ కంపెనీ నార్డ్ సిరీస్‌లో OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తుందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఈ మూడింటిలో మరింత చౌకైన Nord CE 3 Lite ఫోన్ ఏప్రిల్ 4న లాంచ్ అవుతుందని టిప్‌స్టర్స్ చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

చైనీస్ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు వన్‌ప్లస్ (OnePlus) ప్రీమియం ఫోన్లతో పాటు బడ్జెట్ రేంజ్ మొబైల్స్ కూడా తీసుకొస్తుంది. ఈ కంపెనీ త్వరలోనే మరో మూడు బడ్జెట్ మొబైల్స్ తీసుకురానుంది. నార్డ్ సిరీస్‌లో OnePlus Nord 3, Nord CE 3, Nord CE 3 Lite అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తుందని రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. ఈ మూడింటిలో మరింత చౌకైన Nord CE 3 Lite ఫోన్ ఏప్రిల్ 4న లాంచ్ అవుతుందని టిప్‌స్టర్స్ చెబుతున్నారు. అయితే ఈ అప్‌కమింగ్ ఫోన్ గురించి పెద్దగా సమాచారం లేదు.

OnePlus Nord 3 పవర్‌ఫుల్ ప్రాసెసర్, అధిక రిఫ్రెష్-రేట్, లార్జ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌, పెద్ద బ్యాటరీతో వస్తుందని వార్తలు వస్తున్నాయి. Nord CE 3లో ఇచ్చిన ఫీచర్లతో Nord CE 3 Lite రావచ్చని కూడా టాక్‌ నడుస్తోంది. కాగా దీంట్లో తక్కువ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ ఉండచ్చని సమాచారం.

OnePlus Nord CE 3 స్నాప్‌డ్రాగన్ 782G చిప్‌సెట్‌తో, Nord CE 3 Lite స్నాప్‌డ్రాగన్ 695 8nm మొబైల్ ప్రాసెసర్‌తో వస్తుందని లీక్‌స్టర్స్‌ చెబుతున్నారు. Max Jambor అనే ట్విట్టర్ టిప్‌స్టర్ ప్రకారం, వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఏప్రిల్ 4న లాంచ్ అవుతుంది. నార్డ్ CE 3, నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్లు 2023 మూడవ త్రైమాసికం నాటికి రిలీజ్ అవుతాయి. నార్డ్ CE 3 లైట్ 5జీ మొబైల్ పంచ్ హోల్ కట్‌ఔట్‌తో 6.7-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో రావొచ్చు. స్క్రీన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుందని రూమర్స్ వస్తున్నాయి.

ఇది కూడా చదవండి : పాపులర్ ప్రాసెసర్‌తో పోకో ఎక్స్5 రిలీజ్... అమొలెడ్ డిస్‌ప్లే, 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ

వన్‌ప్లస్ నార్డ్ CE 3 Lite 5G 8GB + 128GB, 12GB RAM + 256GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుందని టాక్. 108MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో పాటు 16MP ఫ్రంట్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇందులో కంపెనీ ఆఫర్ చేసిందట. ఫోన్‌లో 67W ఫాస్ట్ ఛార్జింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రో SD కార్డ్ స్లాట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 13 OS ఆధారిత OxygenOS 13 UI పై రన్ అవుతుంది.

నార్డ్ ఫోన్ లైట్ వెర్షన్ సాధారణ వెర్షన్‌కి చాలా భిన్నంగా ఉంటుంది. గతంలో చూసుకుంటే సాధారణ Nord CE 2తో పోలిస్తే Nord CE 2 Lite విభిన్నమైన స్క్రీన్, చిప్‌సెట్, బ్యాటరీతో వచ్చింది. ఇక ఈ లైట్ వెర్షన్ రెగ్యులర్ వెర్షన్ ఫోన్ల రిలీజ్ అప్పుడు కాకుండా వేరే టైమ్‌లో లాంచ్ అవుతూ ఉంటుంది. ఇక స్టాండర్డ్ వెర్షన్ OnePlus Nord CE 3 జులైలో లాంచ్ అవుతుందని రూమర్స్ వచ్చాయి కానీ ఇప్పటివరకు అధికారికంగా లాంచ్ డేట్ విడుదల కాలేదు.

First published:

Tags: New smartphone, Oneplus, Tech news

ఉత్తమ కథలు