హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus: వన్‌ప్లస్‌ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్..ఏప్రిల్ 4న లాంచ్..ధర, ఫీచర్ల వివరాలు..

OnePlus: వన్‌ప్లస్‌ నుంచి సరికొత్త ఇయర్‌బడ్స్..ఏప్రిల్ 4న లాంచ్..ధర, ఫీచర్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 TWS ప్రొడక్ట్స్‌ను ఏప్రిల్ 4న లాంచ్ చేయనుంది. అయితే ఈ రెండు ప్రొడక్ట్స్‌లో నార్డ్‌ బడ్స్‌ 2 యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో రానుంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

OnePlus: వన్‌ప్లస్ కంపెనీ(Oneplus) ఇండియన్‌ మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ప్రీమియం ఫోన్‌లతో పాటు ఇతర గ్యాడ్జెట్‌ను లాంచ్‌ చేస్తూ మార్కెట్‌ను విస్తరిస్తోంది. కొత్తగా మరో రెండు ప్రొడక్టులను లాంచ్‌ చేయడానికి సిద్ధమైపోయింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 TWS ప్రొడక్ట్స్‌ను ఏప్రిల్ 4న లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ లార్జర్ దాన్ లైఫ్ ఈవెంట్‌లో కంపెనీ వీటిని ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ 2023 ఏప్రిల్ 4న రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ రెండు ప్రొడక్ట్స్‌లో నార్డ్‌ బడ్స్‌ 2 యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది సరికొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో రానుంది.

* వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 2 ప్రత్యేకతలు

వ‌న్‌ప్ల‌స్ నార్డ్ బ‌డ్స్‌కు సక్సెసర్‌గా నార్డ్ బడ్స్ 2 మార్కెట్లోకి వస్తున్నాయి. ఒరిజినల్ వన్‌ప్లస్ నార్డ్ బడ్స్‌లో ట్రాన్స్‌ఫరెన్సీ మోడ్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) లేదు. కొత్తగా వస్తున్న బర్డ్స్‌లో ANC ఉంటుంది. ఇవి ఏకంగా 25dB వరకు ANC అవుట్‌పుట్ అందిస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఇయర్‌బడ్స్‌ను USB టైప్-సి పోర్ట్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి 1.5 W ఛార్జింగ్ అవుట్‌పుట్, ఛార్జింగ్ కేస్ 4.5 W ఛార్జింగ్ ఇన్‌పుట్‌తో వస్తాయి. కొత్త ఇయర్‌బడ్స్ డిజైన్ పరంగా మునుపటి వాటి కంటే భిన్నంగా ఉండవచ్చు. వీటిలో 12.4 mm టైటానియం డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి.

నార్డ్ బర్డ్స్‌ 2లో IP55 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌, అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ ఫంక్షన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి 380 mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తాయి. USB టైప్-సి ద్వారా ఛార్జ్ చేయడానికి 1.5 గంటలు పట్టవచ్చు. ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 5.2 వెర్షన్ కనెక్షన్‌ను 10 మీటర్ల రేంజ్‌ ఇస్తాయి. ఈ బడ్స్ లైట్నింగ్ వైట్, థండర్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మొబైల్ , పీసీ, ల్యాప్‌టాప్స్‌కు కంపాటబుల్‌గా ఉండే నార్డ్ బడ్స్ 2 ధర రూ. 2,999 కాగా, ఇవి ఒక సంవత్సరం వారంటీతో వస్తాయి.

WhatsApp: వాట్సాప్‌లో అవతార్ ఎలా క్రియేట్ చేయాలి..? డీపీగా ఎలా పెట్టాలి..? తెలుసుకోండి..

* నార్డ్‌ CE 3 లైట్‌ 5G ఫీచర్లు

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 3 లైట్‌ 5G సరికొత్త పాస్టెల్ లైమ్ కలర్, 2-సర్కిల్ కెమెరా లేఅవుట్‌తో వస్తుంది. వన్‌ప్లస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన టీజర్ వీడియో చూస్తే, ఫోన్ డిజైన్‌ ఎలా ఉంటుందో తెలుస్తోంది. 91 మొబైల్స్ రిపోర్ట్ ప్రకారం.. వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ 3 లైట్‌ 5G స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. ఈ 5G ఫోన్ 8GB RAM, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 13-బేస్డ్ ఆక్సిజన్‌ 13 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 64MP ప్రైమరీ సెన్సార్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP షూటర్ ఉంటుంది.

First published:

Tags: Ear buds, Oneplus

ఉత్తమ కథలు