ఒకప్పుడు వన్‌ప్లస్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు కేరాఫ్‌గా ఉండేది. కొంతకాలంగా మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను కూడా రిలీజ్ చేస్తోంది. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో (OnePlus Nord Series) రిలీజ్ అవుతున్న మొబైల్స్ కాస్త తక్కువ రేట్‌తోనే ఉంటాయి. త్వరలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ (OnePlus Nord CE 3 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ (OnePlus Nord CE 2 5G) స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వేరియంట్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఈ ఫీచర్స్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మరి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ మొబైల్‌లో కూడా ఉంటుంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 + ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
UPI Scam: యూపీఐ పేమెంట్స్‌లో భారీగా మోసాలు... ఈ టిప్స్ గుర్తుంచుకోండి
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108మెగాపిక్సెల్ + 2మెగాపిక్సెల్ డెప్త్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించనుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5ఎంఎం ఆడియో జాక్, టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉంటాయి.
చూడటానికి వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్పెసిఫికేషన్స్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ లాగానే ఉన్నాయి. అయితే ఈ ఫీచర్స్ అన్నీ ప్రచారంలో ఉన్నవి మాత్రమే. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ మొబైల్‌లో ఏఏ ఫీచర్స్ ఉంటాయో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ లాంఛ్ డేట్ కూడా ఎప్పుడో ఇంకా తెలియదు.
Passkeys: పాస్‌వర్డ్ బదులు పాస్‌కీస్ వాడుకోవచ్చు... ఎలా పనిచేస్తుందంటే
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ విషయానికి వస్తే వన్‌ప్లస్ తొలిసారి రూ.20,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. ప్రస్తుతం 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Oneplus, Smartphone