Home /News /technology /

ONEPLUS NORD CE 2 LITE 5G NORD BUDS WITH AMAZING FEATURES DO YOU KNOW THE PRICE EVK

One Plus Nord CE 2 Lite 5G: వ‌న్ ప్ల‌స్ అద‌ర‌గొట్టేసింది.. అద్భుత‌మైన ఫీచ‌ర్స్‌తో స్మార్ట్ ఫోన్‌లు.. నార్డ్ బ‌డ్స్‌.. ధ‌ర ఎంతో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OnePlus 10R, Nord CE2 Lite 5G, Nord Buds: టెక్ ప్రియులు ఎంతో ఎందురు చూస్తున్న మోడ‌ల్స్‌ OnePlus నుంచి అద్భుతమైన మోడల్‌ల్స్ మార్కెట్‌లోకి వ‌చ్చేశాయి. ఈ నేప‌థ్యంలో భారతదేశంలో ధర స్పెష‌ల్ ఆఫ‌ర్స్ ఏమ‌న్నా ఉన్నాయేమో తెలుసుకోండి..

    వినియోగ‌దారులు.. టెక్ ప్రియులు ఎదురుచూస్తున్న వ‌న్‌ప్ల‌స్ స్మార్ట్ ఫోన్ వ‌చ్చేసింది. ‘మోర్ పవర్ టూ యూ’ అనే పేరుతో ఈవెంట్ నిర్వ‌హించిన వ‌న్‌ప్ల‌స్ రెండు స్మార్ట్‌ఫోన్‌ల‌ను తీసుకొచ్చింది. ఈ సారి ఎన్నో ప్ర‌త్యేక‌త‌ల‌తో వినియోగ‌దారుల ముందుకు ఈ ఫోన్‌లు వ‌చ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ల‌తోపాటు అంతే కాకుండ OnePlus Nord బడ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్కెట్‌లోకి దూసుకొచ్చిన ఈ కొత్త మొడ‌ల్స్ ఫీచ‌ర్స్ ధ‌ర‌ల వివ‌రాలు తెలుసుకోండి.

    వ‌న్‌ప్లస్‌ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ (OnePlus Nord CE 2 Lite 5G) ఫీచ‌ర్స్
    - 6జీబీ ర్యామ్ + 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
    - 6.59 ఇంచుల Full HD+ LCD డిస్‌ప్లే
    - 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 202ppi పిక్సెల్ డెన్సిటీ, 240Hz టచ్ రెస్పాన్స్ రేట్
    - స్నాప్‌డ్రాగన్ 695 (Snapdragon 695) ప్రాసెసర్‌
    - ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1
    - ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది.
    - 64 మెగాపిక్సల్ ఫ్రంట్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ ఉంటుంది.
    - సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ Sony IMX471 ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
    - 5G, 4G LTE, వైఫై 6, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, బ్లూటూత్ 5.2, జీపీఎస్, NFC, USB టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఈ ఫోన్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ- 5000mAh బ్యాటరీ
    - 33W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్
    - 30 నిమిషాల్లోనే ఫోన్‌ 50 శాతం చార్జ్ ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌

    WhatsApp Down: సార్... వాట్సప్‌ని కొనేయండి ప్లీజ్... యాప్ డౌన్ కావడంతో ఎలాన్ మస్క్‌కు యూజర్ల రిక్వెస్ట్

    ధ‌ర వివ‌రాలు..
    - Nord CE 2 Lite రూ. 19,999 (6GB + 128GB) నుండి అందుబాటులో ఉంటుంది
    - OnePlus Nord బడ్స్ రూ. 2,799 మరియు తెలుపు మరియు నలుపు అనే రెండు రంగులలో లభిస్తుంది.
    - ఫోన్ 8GB RAM వేరియంట్‌ను కూడా కలిగి ఉంది, దీని ధర రూ.21,999. SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు రూ. 1,500 తక్షణ బ్యాంక్ తగ్గింపును పొందవచ్చు.
    - SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు OnePlus Nord CE 2 Lite కొనుగోలు చేసిన తర్వాత మూడు నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.

    వ‌న్‌ప్ల‌స్ 10ఆర్ ఫీచ‌ర్స్ వివ‌రాలు..
    వ‌న్‌ప్ల‌స్ నుంచి వ‌చ్చిన మ‌రో అద్భుతమైన ఫీచ‌ర్స్ ఉన్న ఫోన్ వ‌న్‌ప్ల‌స్ 10ఆర్. ఈ ఈవెంట్‌లోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. 150వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ వేరియంట్‌తో పాటు 80వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ మోడల్‌ కూడా విడుదలైంది.

    - 6.7 ఇంచుల Full-HD+ AMOLED డిస్‌ప్లే
    - 120Hz రిఫ్రెష్‌ రేట్, 720Hz టచ్ రెస్పాన్స్ రేట్
    - 2.5D కర్వ్‌డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
    - MediaTek Dimensity 8100-Max ప్రాసెసర్‌
    - ఆండ్రాయిడ్‌ 12 ( Android 12 ) తో కూడిన ఆక్సిజన్ఓఎస్ 12.1
    - ఫోన్ వెనుక వెనుక మూడు కెమెరాలు
    - ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50 మెగాపిక్సెల్ Sony IMX766 ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ Sony IMX355 అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ప్ర‌త్యేక‌త‌లు
    - ఇక 16 మెగాపిక్సెల్ Samsung ISOCELL S5K3P9 సెన్సార్‌తో కూడిన ఫ్రంట్ కెమెరా
    - 4500mAh బ్యాటరీ కలిగి ఉన్న OnePlus 10R 5G వేరియంట్ 150W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 5000mAh బ్యాటరీ
    - 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ ఆప్షన్లుగా అద‌న‌పు ఫీచ‌ర్స్..

    Instagram Features: కొత్త అప్‌డేట్‌ తీసుకొస్తున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ట్రై చేయండి


    ధ‌ర వివ‌రాలు..
    - బ‌వన్‌ప్లస్‌ 10ఆర్ 5జీ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999, 12జీబీ ర్యామ్ + 256జీబీ ధర రూ.42,999గా ఉంది.
    - 150వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్న OnePlus 10R Endurance Edition 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.43,999గా వన్‌ప్లస్‌ నిర్ణయించింది. మే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్, వన్‌ప్లస్‌ ఆన్‌లైన్ స్టోర్, రిలయన్స్ డిజిటల్, క్రోమా త‌దిత‌ర ఆఫ్‌లైన్ స్టోర్‌ల‌లో ల‌భిస్తుంది.

    అందుబాటులో వ‌న్ ప్ల‌స్ నార్డ్ బ‌డ్స్..
    వ‌న్ ప్ల‌స్ నుంచి వ‌చ్చిన మ‌రో టెక్ గాడ్జెట్ OnePlus Nord బడ్స్ దీన ధ‌ర‌ రూ. 2,799 మరియు తెలుపు మరియు నలుపు అనే రెండు రంగులలో లభిస్తుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Latest Technology, ONE PLUS, Smart phones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు