Home /News /technology /

ONEPLUS NORD CE 2 5G VS ONEPLUS NORD CE KNOW COMPARISON BETWEEN THESE TWO 5G SMARTPHONES SS

OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ, నార్డ్ సీఈ 2 స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఇవే

OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ, నార్డ్ సీఈ 2 స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఇవే
(image: OnePlus India)

OnePlus Nord CE 2 5G: వన్‌ప్లస్ నార్డ్ సీఈ, నార్డ్ సీఈ 2 స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఇవే (image: OnePlus India)

OnePlus Nord CE 2 5G | వన్‌ప్లస్ నార్డ్ సీఈ అప్‌గ్రేడ్ వర్షన్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ (OnePlus Nord CE 2 5G) స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. మరి వన్‌ప్లస్ ఎలాంటి అప్‌గ్రేడ్స్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిందో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ మోడల్స్ ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ (OnePlus Nord CE 2 5G) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. రూ.25,000 లోపు బడ్జెట్‌లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 (MediaTek Dimensity 900) ప్రాసెసర్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. గతేడాది రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ అప్‌గ్రేడ్ వర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ మొబైల్ రిలీజ్ అయింది. మరి మొదటి వర్షన్ కన్నా రెండో వర్షన్ బాగుందా? అప్‌గ్రేడ్స్ ఉన్నాయా? లేటెస్ట్‌గా రిలీజ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలేంటీ? రెండు నార్డ్ సీఈ ఫోన్ల మధ్య తేడాలేంటీ? తెలుసుకోండి.































































     స్పెసిఫికేషన్స్వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీవన్‌ప్లస్ నార్డ్ సీఈ
     డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే
     ర్యామ్ 6జీబీ, 8జీబీ 6జీబీ, 8జీబీ, 12జీబీ
     ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబీ 128జీబీ, 256జీబీ
     ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ
     రియర్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
     ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్
     బ్యాటరీ 4,500ఎంఏహెచ్ (65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) 4,500ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
     ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఓఎస్ 11.3 ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఓఎస్
     సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్
     కలర్స్ బహామా బ్లూ, గ్రే మిర్రర్ బ్లూ వాయిడ్, చార్‌కోల్ ఇంక్, సిల్వర్ రే
     ధర 6జీబీ+128జీబీ- రూ.23,999
    8జీబీ+128జీబీ- రూ.24,999
    6జీబీ+128జీబీ- రూ.22,999
    8జీబీ+128జీబీ- రూ.24,999
    12జీబీ+256జీబీ- రూ.27,999

    Snapdragon 695: స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో మూడు స్మార్ట్‌ఫోన్స్... వీటిలో ఏది బెస్ట్?

    ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య ప్రధాన మార్పులు చూస్తే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో రిలీజ్ కావడం విశేషం. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ 65వాట్ SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభిస్తుంది. ధర కూడా ఒకే రేంజ్‌లో ఉంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ఇటీవల రిలీజ్ అయిన ఒప్పో రెనో 7 మొబైల్ ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone

    తదుపరి వార్తలు