Home /News /technology /

ONEPLUS NORD CE 2 5G ONEPLUS TV Y1S AND Y1S EDGE TO BE UNVEILED AT 7 PM ON 17 FEB HERE DETAILS NS

OnePlus Nord CE 2 5G, OnePlus TV Y1S మరియు Y1S Edge లాంఛ్ ఈ రోజే.. వివరాలివే..: Advertisement

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

#OnePlusNordCE2  మరియు #OnePlusTVY1S ను ఫిబ్రవరి 17 న రాత్రి 7 గంటలకు ఆవిష్కరించడం జరుగుతుంది. స్లికర్ డిజైన్ OnePlus ఎకోసిస్టమ్‌తో మెరుగైన ఏకీకరణ, 65 W #SuperVOOC మరియు అనేక ఇతర ఫీచర్ల కోసం వేచియుండండి. రాబోయే వాటిని వీక్షించడం కోసం, ఇక్కడకు వెళ్ళండి...

ఇంకా చదవండి ...
  OnePlus Nord CE 2 5G, OnePlus TV Y1S మరియు Y1S Edge లు ఫిబ్రవరి 17 రాత్రి 7 గంటలకు మీముందుకు రానున్నాయి: కార్యక్రమం ప్రత్యక్ష ప్రసార వివరాలను ఇక్కడ చూడండి!

  OnePlus Nord CE 2 5G స్మార్ట్ఫోన్ మరియు సరికొత్త OnePlus TV Y1S, Y1S Edge ఆవిష్కరణకు ఎంతో సమయం లేదు. లాంచ్ కార్యక్రమాన్ని చూడడానికి, ఫిబ్రవరి 17 రాత్రి 7 గంటలలోపు OnePlus ఇండియా యూట్యూబ్ పేజీకి వెళ్లండి!

  రాబోయే పరికరాల గురించి మనకు ఏమి తెలుసు? నిజానికి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి.
  Nord CE 2 5G: 64 MP AI కెమెరా, 65 W ఛార్జింగ్, 1 TBమైక్రోSD, ఇంకా మరెన్నో

  సరికొత్త ARM కార్టెక్స్ A78 కోర్స్ మరియు Mali G68 GPU ఫీచర్తో శక్తివంతమైన, 5G-సామర్థ్యం గల MediaTek డైమెన్సిటీ 900 చిప్తో Nord CE 2 5G లభిస్తుందని OnePlus ధృవీకరించడమైంది. దీనిలో గల microSD సపోర్ట్ కారణంగా స్టోరేజ్ని 1 TB వరకూ విస్తరించవచ్చు  అనే విషయం మనకు తెలిసినదే, అంతేకాకుండా హెడ్ఫోన్ జాక్ కూడా అందుబాటులో కలదు. ఇది మనకు 6 GB RAM మరియు 128 GB స్టోరేజ్తో లభిస్తుందని భావిస్తున్నాము, అయితే ఇది ఇంకా ధృవీకరించబడలేదు.

  దీనికి వెనుక భాగంలో 64 MP AI ట్రిపుల్ కెమెరా సిస్టమ్ మరియు వేగవంతమైన 65 W SuperVOOC ఛార్జింగ్ ప్రమాణానికి మద్దతు అందిస్తుంది. OnePlus ప్రకారం, మరింత సహజమైన డిజైన్, అనుభూతి కోసం కెమెరాను సజావుగా పొందుపరచే సింగిల్-పీస్ బ్యాక్ కవర్తో స్లికర్ డిజైన్తో వస్తుంది.

  ఇవి పారదర్శక గ్లాస్ ప్యానెల్పై సిరామిక్ ఫినిషింగ్ తో బహామా  మరియు బ్లూ, గ్రే మిర్రర్ వేరియంట్లలో లభిస్తున్నాయి. మన చేతిలో ఉండే ఫోన్ ఆకర్షణీయంగా ఉన్నట్లయితే, మనం ట్రీట్లో ఉన్నట్టే.

  OnePlus TV Y1S మరియు Y1S Edge: నిరంతరాయమైన కనెక్టివిటీ మరియు స్మార్ట్ ఫీచర్లు

  నాణ్యత, ఫీచర్లలో ఎటువంటి రాజీ పడకుండా అందించిన ఫీచర్-ప్యాక్డ్ OnePlus TV Y1 గత ఏడాది సరసమైన ధరకే లభించింది. ఇప్పుడు Y1S కూడా దానికి భిన్నంగా ఉంటుందని మేము ఆశించడం లేదు. మేము విన్నదాని ప్రకారం, Y1S మరియు Y1S Edge రెండూ కూడా బెజెల్-లెస్ డిజైన్తో, OnePlus Gamma ఇంజిన్కు మద్దతునిస్తాయి. AI-ఆధారిత రియల్-టైమ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ అయిన OnePlus Gamma ఇంజిన్ మీరు చూస్తున్న కంటెంట్ ఆధారంగా కలర్, ఆడియోను మెరుగుపరుస్తుంది. అయితే TV Android TV 11 OS తో నడుస్తుంది.

  మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, Y1S వాచ్, బడ్స్తో సహా మొత్తం OnePlus ఎకో సిస్టమ్ తో సజావుగా పెయిర్ అవుతుంది. ఒకే సమయంలో గరిష్టంగా 5 ఫోన్ల వరకు కనెక్ట్ చేయవచ్చు, అలాగే వాటిని ఇన్పుట్ టెక్స్ట్ కోసం, టీవీని నియంత్రించడం, ఇంకా మరెన్నో విషయాలకు ఉపయోగించవచ్చు! బడ్స్ కూడా దాని కేస్ని పాప్ చేసిన వెంటనే పెయిర్ అవుతాయి, అలాగే వాచ్ కూడా అంతే సులభంగా పెయిర్ అవుతుంది. బడ్స్ ను మీ చెవి నుండి తీసినప్పుడు, అలాగే పెట్టినప్పుడు దానంతట అదే పాజ్ అవడం రెస్యూమ్ అవడం జరుగుతుంది. ఇది ఇన్కమింగ్ కాల్స్ కు కూడా వర్తిస్తుంది, ఒకవేళ మీరు కాల్లో ఉన్నట్లయితే దానంతట అదే టీవీ వాల్యూమ్ తగ్గించడం, కాల్ పూర్తయిన తరువాత టీవీ వాల్యూమ్ పెంచడం జరుగుతుంది.

  వాచ్ సింక్ ఫీచర్లు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి, మీరు టీవీని నియంత్రించడం మాత్రమే కాకుండా, దానిని ఆన్, ఆఫ్ చేయడానికి కూడా వాచ్ని ఉపయోగించవచ్చు, అంతేకాకుండా మీరు నిద్రపోతున్న విషయం మీ వాచ్ గుర్తించినప్పుడు టీవీని ఆఫ్ చేయడానికి ట్రాకింగ్ను ఉపయోగించవచ్చు. ఇది నిజంగా చాలా బాగుంది కదూ!

  వినియోగదారులకు నిరంతరాయమైన వినోదాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించిన ఫీచర్లన్నీ OnePlus ఎకోసిస్టమ్లో పెట్టుబడి పెట్టిన అందించే బహుమతి. ఫీచర్లను ఉపయోగించడానికి అందరూ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని అనుకుంటున్నాను.

  ఫిబ్రవరి 17 రాత్రి ఏడు గంటలకు ప్రసారమయ్యే ఆవిష్కరణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పరికరాల కోసం మీరు OnePlus ల్యాండింగ్ పేజీని సందర్శించి Nord CE 2 5G లేదా TV Y1S ని గెలుచుకునే అవకాశం కోసం సైన్ అప్ చేయవచ్చు!
  This is a partnered Content  
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: 5G Smartphone, ONE PLUS, Smartphone

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు