ONEPLUS NORD BUDS LAUNCHED IN INDIA BUDGET WIRELESS EARBUDS RELEASED WITH DOLBY ATMOS GH VB
OnePlus Nord Buds: ఇండియాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్.. బడ్జెట్ ధరల్లో బెస్ట్ ఫీచర్స్..
ప్రతీకాత్మక చిత్రం
వన్‌ప్లస్ నుంచి నార్డ్ బడ్స్ (Nord Buds) పేరుతో ఇయర్ బడ్స్ లాంచ్ అయ్యాయి. ఈ బడ్జెట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఏప్రిల్ 28, గురువారం నాడు రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ 10ఆర్ (OnePlus 10R), వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite 5G) ఫోన్లతో పాటు ఇండియాలో లాంచ్ అయ్యాయి.
మిడ్ రేంజ్(Midrange), ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల(Flagship smartphones) తయారీలో తనదైన మార్క్ చూపించిన వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ.. ఇటీవల ఆడియో(Audio) డివైజ్‌లపై కూడా దృష్టిసారించింది. కంపెనీ ఇప్పటికే ఆడియో ప్రొడక్ట్స్‌పై(Audio Products) అధికారిక ప్రకటనలు కూడా చేసింది. తాజాగా వన్‌ప్లస్ నుంచి నార్డ్ బడ్స్ (Nord Buds) పేరుతో ఇయర్ బడ్స్(Ear Buds) లాంచ్ అయ్యాయి. ఈ బడ్జెట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఏప్రిల్ 28, గురువారం నాడు రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ 10ఆర్ (OnePlus 10R), వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 లైట్ (OnePlus Nord CE 2 Lite 5G) ఫోన్లతో పాటు ఇండియాలో లాంచ్ అయ్యాయి. నార్డ్ బడ్స్ అనేవి వన్‌ప్లస్ కంపెనీ నుంచి "Nord" బ్యానర్‌లో వచ్చిన మొదటి ఆడియో ప్రొడక్ట్. వీటితో కంపెనీ బడ్స్ Z2 లేదా బడ్స్ ప్రో లాంటి యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత సరసమైన ధరకు అందిస్తోంది. ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ ధరను రూ. 2,799గా నిర్ణయించారు. ఇవి మే 10 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
నార్డ్ బడ్స్ 12.4 మిమీ టైటానియం డైనమిక్ డ్రైవర్స్‌తో వస్తాయి. రిచ్ బాస్, రేజర్-షార్ప్ ట్రెబుల్ అందించేలా వీటిని రూపొందించారు. బడ్స్ Z2 మాదిరిగానే నార్డ్ బడ్స్ కూడా డాల్బీ అట్మాస్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ 4 మైక్రోఫోన్‌లతో వస్తాయి. స్పష్టమైన వాయిస్ కాల్స్ కోసం యాంబియంట్ నాయిస్, విండ్ నాయిస్‌ను తగ్గించడానికి AI-పవర్డ్ నాయిస్ రిడక్షన్ అల్గారిథమ్‌లను ఇవి ఉపయోగిస్తాయి. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే, 30 గంటల వరకు కంబైన్డ్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయి. ఇవి ఫ్లాష్ లేదా ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ స్పెషాలిటీతో నార్డ్ బడ్స్ కేవలం 18 నిమిషాల టాప్-అప్ తర్వాత 5 గంటల ఆడియో ప్లేబ్యాక్‌ను అందించగలవని కంపెనీ పేర్కొంది.
ఈ ఇయర్‌బడ్స్ ఫ్లాట్-అవుట్ స్టెమ్, సెమీ ఇన్-ఇయర్ స్టైలింగ్‌తో వస్తాయి. నార్డ్ బడ్స్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తాయి. యూజర్లకు బ్లాక్ స్లేట్, వైట్ మార్బుల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఇవి IP55 స్వెట్ రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తాయి. బ్లూటూత్ 5.2 ద్వారా కనెక్ట్ అవుతాయి. ఈ వైర్‌లెస్ బడ్స్ 94 ఎంఎస్‌ల కంటే తక్కువ లేటెన్సీతో వస్తాయి. వన్‌ప్లస్ డివైజ్‌లు వాడే యూజర్లు మంచి కనెక్టివిటీ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. అయితే గ్రాన్యులర్ కంట్రోల్స్ కోసం ఒప్పో HeyMelody యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. నార్డ్ బడ్స్ OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.