హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus' Nord Buds: ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సేల్స్ ప్రారంభం.. వీటి ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలు..

OnePlus' Nord Buds: ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సేల్స్ ప్రారంభం.. వీటి ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వన్‌ప్లస్ ఇటీవల అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus Nord CE 2 Liteను రిలీజ్ చేసింది. దీంతో పాటు నార్డ్ బడ్స్ TWS ఇయర్‌బడ్స్‌ను గత నెలలో దేశంలో లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్ సేల్స్ తాజాగా ప్రారంభమయ్యాయి.

మిడ్‌రేంజ్(Midrange), ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లతో(Smartphone) పాటు ఆడియో డివైజ్‌లను(Audio Devise) ఉత్పత్తి చేస్తున్న వన్‌ప్లస్ (OnePlus) కంపెనీ.. తాజాగా నార్డ్ బడ్స్ (OnePlus Nord Buds) పేరుతో సరికొత్త వైర్‌లెస్ ఇయర్ బడ్స్ లాంచ్(Ear Buds Launch) చేసింది. ఇవి వన్‌ప్లస్ అఫిషియల్ ఛానెల్స్, ఫ్లిప్‌కార్ట్(Flipkart), అమెజాన్(Amazon) ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్(Oneplus) ఇటీవల అత్యంత చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ అయిన OnePlus Nord CE 2 Liteను రిలీజ్ చేసింది. దీంతో పాటు నార్డ్ బడ్స్ TWS ఇయర్‌బడ్స్‌ను గత నెలలో దేశంలో లాంచ్ చేసింది. ఈ ప్రొడక్ట్ సేల్స్ తాజాగా ప్రారంభమయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ అనేవి దేశంలోని ఈ కంపెనీ నుంచి వచ్చిన అత్యంత సరసమైన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్. కస్టమర్లు వైట్, బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో వీటిని ఎంచుకోవచ్చు. ఛార్జింగ్ కేస్ ఇయర్‌బడ్స్ కలర్‌లోనే ఉంటుంది.

* నార్డ్ బడ్స్ ధర

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్.. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, ఇతర ఆఫ్‌లైన్ పార్ట్నర్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. మే 10 మధ్యాహ్నం నుంచి వీటి సేల్స్ ప్రారంభమయ్యాయి. వీటి ధర రూ. 2,999. ఈ ఇయర్‌బర్స్ నార్డ్ లైనప్‌లో వచ్చిన మొదటి ఇయర్‌బడ్స్. కంపెనీ ప్రస్తుతం దేశంలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో, వన్‌ప్లస్ బడ్స్ Z2 TWS ఇయర్‌బడ్స్‌ను వరుసగా రూ. 9,990, రూ.4,999కి విక్రయిస్తోంది. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు అదనపు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Fixed Deposit Interest Rates: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. FDలపై వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్స్ ఇవే..


* నార్డ్ బడ్స్ స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్‌లో రిచ్ బాస్, రేజర్-షార్ప్ ట్రెబుల్ అందించడానికి 12.4mm డైనమిక్ ఆడియో డ్రైవర్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ బడ్స్ Z2 మాదిరిగానే, నార్డ్ బడ్స్ కూడా 3D సౌండ్ ఎఫెక్ట్‌ను అందించడానికి డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌తో వస్తాయి. అయితే వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) లేదు. క్లీన్ ఆడియోను అందించడానికి ఫీచర్ బయటి శబ్దాన్ని ఫిల్టర్ చేస్తుంది. AI- పవర్డ్ నాయిస్ రిడక్షన్ అల్గారిథమ్‌లతో ఇయర్‌బడ్స్ స్పష్టమైన ఆడియోకు సపోర్ట్ చేస్తాయని వన్‌ప్లస్ తెలిపింది.

వన్‌ప్లస్ నార్డ్ బడ్స్‌లో నాలుగు మైక్రోఫోన్‌లు ఉన్నాయి. ఇవి బ్లూటూత్ 5.2కి సపోర్ట్ చేస్తాయి. వినియోగదారులు వాటిని ఆండ్రాయిడ్ ఫోన్‌లు, యాపిల్ ఐఫోన్‌లతో ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ డివైజ్ యూజర్లు తమ ఫోన్‌కు నార్డ్ బడ్స్‌ను ఈజీగా కనెక్ట్ చేయడానికి వన్‌ప్లస్ ఫాస్ట్ పెయిర్ టెక్నాలజీతో వచ్చాయి. ఇవి ఫుల్ ఛార్జ్‌పై 30 గంటల కంబైన్డ్ ప్లేబ్యాక్‌ను అందించగలదని, ఒక్కో ఇయర్‌బడ్ ఒకే ఛార్జ్‌పై ఏడు గంటల ప్లేబ్యాక్‌ టైమ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Ear buds, Oneplus, Technology

ఉత్తమ కథలు