హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Nord 3: వన్‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవేనా?

OnePlus Nord 3: వన్‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవేనా?

OnePlus Nord 3: వన్‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవేనా?
(ప్రతీకాత్మక చిత్రం)

OnePlus Nord 3: వన్‌ప్లస్ నార్డ్ 3 వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవేనా? (ప్రతీకాత్మక చిత్రం)

OnePlus Nord 3 | వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఇండియాలో త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొన్ని స్పెసిఫికేషన్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ఓ స్మార్ట్‌ఫోన్‌లా వన్‌ప్లస్ నార్డ్ 3 ఉంటుందని అంచనా.

ఇంకా చదవండి ...

ఒకప్పుడు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా పేరుతెచ్చుకున్న వన్‌ప్లస్... కొంతకాలం తర్వాత నార్డ్ సిరీస్‌లో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ రూ.25,000 ధరకు కాస్త అటూఇటుగా వచ్చాయి. అంతేకాదు... ఇటీవల రూ.20,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 20,000) వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ (OnePlus Nord CE 2 Lite 5G) మోడల్ రిలీజైంది. తొలిసారి ఇంత తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది వన్‌ప్లస్. త్వరలో ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ 3 మొబైల్ రిలీజ్ కాబోతోందన్న వార్తలు వస్తున్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ 3 వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో కనిపించినట్టు @stufflistings పేరుతో ట్విట్టర్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్న ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. అయితే అందులో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోటోలు, స్పెసిఫికేషన్స్ ఏవీ లేవు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు లాంఛ్ అవుతుందన్న స్పష్టత కూడా లేదు. అయితే జూలైలో వన్‌ప్లస్ నార్డ్ 3 లాంఛ్ అయ్యే అవకాశాలున్నాయి.

Android Smartphones: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇక ఈ ఫీచర్ వాడుకోలేరు

వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ చూడటానికి వన్‌ప్లస్ 10ఆర్ మోడల్‌లా ఉంటుందని అంచనా. ఇటీవల వన్‌ప్లస్ 10ఆర్, రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్స్ 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్ 3 మోడల్‌లో కూడా ఇదే ప్రాసెసర్, 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుందని భావిస్తున్నారు.

Google: గూగుల్ నుంచి అద్భుతమైన ఫీచర్... ఇక మీ పాస్‌వర్డ్ లీక్ అయ్యే ఛాన్స్ తక్కువ

వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ రియల్‌మీ జీటీ నియో 3 మోడల్‌లా ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. వన్‌ప్లస్ నార్డ్ 3 మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 50మెగాపిక్సెల్ Sony IMX766 + 8మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా + 2మెగాపిక్సెల్ టెర్టియర్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. బ్యాటరీ విషయానికి వస్తే 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 150వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇండియాలో రియల్‌మీ జీటీ నియో 3 ధర చూస్తే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.36,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.38,999. ఇక 150వాట్ అల్‌ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999. వన్‌ప్లస్ 10ఆర్ కూడా దాదాపు ఇదే బడ్జెట్‌లో రిలీజైంది. మరి వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ఏ బడ్జెట్‌లో రిలీజ్ అవుతుందో చూడాలి.

First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone

ఉత్తమ కథలు