హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Nord 2T: వన్‌ప్లస్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్... ఫీచర్స్ ఇవే

OnePlus Nord 2T: వన్‌ప్లస్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్... ఫీచర్స్ ఇవే

OnePlus Nord 2T: వన్‌ప్లస్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్... ఫీచర్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

OnePlus Nord 2T: వన్‌ప్లస్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్... ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

OnePlus Nord 2T | వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ (OnePlus Nord 2T) మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కంపెనీ. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉండటం విశేషం.

నార్డ్ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ యూరప్‌లో ఆవిష్కరించింది. మిడ్- రేంజ్ సెగ్మెంట్‌లో తీసుకొచ్చిన ఈ కొత్త మొబైల్ 2Tలో మీడియా టెక్ ప్రాసెసర్, ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇటీవల భారత మార్కెట్లలో విడుదలైన OnePlus 10R, OnePlus Nord CE 2 Lite తరువాత దీన్ని యూరప్‌లో లాంచ్ చేయడం గమనార్హం. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్‌లో వచ్చింది. 8GB/128GB మోడల్ ధర 399 యూరోలు. అదే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.32,100గా నిర్ణయించారు. బ్ల్యాక్, గ్రీన్ కలర్స్‌లో లభించనుంది. Nord 2T ప్రస్తుతానికి యూరప్ వెలుపల ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వన్‌ప్లస్ వెల్లడించలేదు. అయితే త్వరలోనే ఇండియాలో ఈ మోడల్ లాంచ్ కానుందని అంతా భావిస్తున్నారు.

OnePlus Nord 2T స్పెసిఫికేషన్లు


ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ 12.1 ఆపరేటింగ్ ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43-అంగుళాల FHD+ అమోలెడ్ డిస్‌ప్లే ప్యానెల్‌ ఇస్తున్నారు. మీడియా టెక్ డైమిన్‌సిటీ 1300 SoC ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు... వెనుక భాగంలో మూడు, ముందు భాగంలో ఒకటి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 50 MP సోనీ IMX766 సెన్సార్‌తో వెనుకవైపు ట్రిపుల్-కెమెరా సెటప్‌ ఉంది. ఇతర రెండు కెమెరాలలో ఒకదాంట్లో 8 MP అల్ట్రా వైడ్ లెన్స్, మరో దాంట్లో 2 MP మోనోక్రోమ్ సెన్సార్ ఉన్నాయి. ప్రధాన కెమెరా కూడా OIS కి మద్దతు ఇస్తుంది.

Smartphone Under Rs 10,000: 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ముందు భాగంలో Nord 2T 32 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. అలాగే 4,500 mAh బ్యాటరీని ఇస్తున్నారు. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ చేస్తుంది.

ఇది ఇలా ఉండే గత నెలలో భారత మార్కెట్‌లలో పదుల సంఖ్యలో స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అయ్యాయి. రియల్‌మీ, వన్‌ప్లస్‌, సామ్‌సంగ్‌, షావోమీ, ఐకూ నుంచి ఫోన్లు వచ్చాయి. 150 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్ ఉండే మొబైళ్లు తొలిసారి ఏప్రిల్‌లోనే లాంచ్ అయ్యాయి. రియల్‌మీ జీటీ నియో 3 ఫాస్టెస్ట్ ఫాస్ట్ చార్జింగ్‌తో వచ్చాయి. పోకో నుంచి అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. రియల్‌మీ, షావోమీ ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్‌ మొబైళ్లు రియల్2మీ GT 2 Pro, షావోమీ 12 Pro అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకున్నాయి.

Vivo Offer: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.5,000 క్యాష్‌బ్యాక్... ఆఫర్ మూడు రోజులే

రియల్‌మీ జీటీ2 ప్రో


ప్రీమియమ్ సెగ్మెంట్‌లో రియల్‌మీ జీటీ 2 ప్రో గత నెలలో భారత్‌లో లాంచ్ అయింది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 5G ప్రాసెసర్‌ తో ఇది పనిచేస్తుంది. 6.7 ఇంచుల E4 AMOLED 2K డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. పేపర్ టెక్ డిజైన్, 50 మెగాపిక్సెల్ Sony IMX 766 ప్రధాన కెమెరాలను అమర్చారు. ఇందులో 5000mAh బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 65 వాట్ల సూపర్ డార్ట్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. Realme GT 2 Pro ప్రారంభ ధర రూ.49,999గా ఉంది.

షావోమీ 12 ప్రో 5జీ


షావోమీ ప్రీమియమ్ ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఈ మోడల్ స్మార్ట్ ఫోన్‌ను భారత్‌‌లో లాంచ్ చేసింది. పవర్‌ఫుల్‌ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌‌తో ఇది పనిచేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఇవి 50 మెగాపిక్సెల్ సామర్థ్యం గల ఫ్లాగ్‌షిప్‌ సెన్సార్లతో పనిచేస్తాయి. 6.72 ఇంచుల WQHD+ E5 AMOLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఇందులో 4600 mAh బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 120వాట్ల వైర్డ్, 50వాట్ల వైర్‌లెస్‌ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. Xiaomi 12 Pro ప్రారంభ ధర రూ.62,999గా నిర్ణయించారు.

First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Oneplus, Smartphone

ఉత్తమ కథలు