వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో ఇండియాలో వన్‌ప్లస్ నార్డ్ 2టీ (OnePlus Nord 2T) మొబైల్ రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ మేలో యూరప్ మార్కెట్లో రిలీజైన సంగతి తెలిసిందే. కాబట్టి స్పెసిఫికేషన్స్ తెలిసినవే. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో రిలీజైంది. వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 33,999. జూలై 5న సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో వన్‌ప్లస్ నార్డ్ 2టీ బేస్ వేరియంట్‌ను రూ.27,499 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.32,499 ధరకు కొనొచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్పెసిఫికేషన్స్
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆక్సిజన్ ఓఎస్ 12.1 + ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్‌కు రెండు ఆండ్రాయిడ్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజైంది. 5జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. 15నిమిషాలు ఛార్జ్ చేస్తే ఒక రోజంతా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, వైఫై, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ, టైప్ సీ కేబుల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. గ్రే షాడో, జేడ్ ఫాగ్ కలర్స్‌లో కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.